ఇంట్లో శంఖాన్ని ఎక్కడ పెట్టాలి?

-

పురాణాల ప్రకారం శంఖం ఇంట్లో ఉండటం చాలా మంచిది. దానిని ఇంట్లో పెట్టుకోవడం వల్ల ఇంటికి శుభం కలుగుతుందరి అంటారు. అందుకే దేవాలయాల్లోనే కాకుండా ఇళ్లలో కూడా శంఖాన్ని పెట్టుకుంటున్నారు. సాధారణంగా మనం శంఖాలను ఆలయాల్లో చూస్తాం. వాటిని మన ఇళ్లలో పెట్టుకోవాలనుకున్నవారు ఎక్కడ పెట్టి పూజించాలి, వాటికి ఎలా పూజలు చేయాలి, తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఎంటనేవి తెలియవు. ఇవన్ని మనం తెలియకుండానే వాటికి పూజలు చేస్తున్నారు. అయితే శంఖాన్ని కొనాలని నిర్ణయించుకున్నవారు ఇష్టం వచ్చినట్టుగా శంఖాన్ని కొనకూడదు. శంఖాన్ని ఇళ్లలో పెట్టుకున్నవారు ప్రతిరోజు పూజ చేయాల్సి ఉంటుంది. శంఖం విష్ణుమూర్తికి నిదర్శనం. కొన్ని రోజులు పూజలు చేసి, ఆ తర్వాత ఇష్టం వచ్చినట్లు వదిలేస్తే ఇంట్లోకి నెగెటివ్‌ ఎనర్జీ ప్రవేశిస్తుంది.

నిష్టతో నిత్యం పూజలు చేస్తూ ఉండాలి. చాలా పవిత్రంగా చూసుకోవాలి. చాలా మంది ఇళ్లలోని పూజగదిలో పెడతారు. పండితులు చెప్పిన ప్రకారం ఒకేసారి రెండు శంఖాలను కొనాలి. రెండూ ఊదడానికి కాదు. అందులో కేవలం ఒకటి ఊదేందుకు, మరోటి పూజ చేసేందుకు వాడాలి. దేనికి అది ప్రత్యేకంగా పెట్టాలి. పూజకు వాడే శంఖాన్ని నీటి శంఖం అంటారు. అయితే ఈ రెండింటినీ ఎప్పుడూ ఒకే దగ్గర పెట్టకూడదని అంటారు.

శంఖం పెట్టే ప్రదేశాన్ని జాగ్రత్తగా పరిశీలించుకోవాలి. వాటితో రోజూ మనకు పని లేకపోవచ్చు. అయితే వాటిని పెట్టే ప్రదేశంపై తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శంఖాలను ఎరుపు వస్త్రంలో లేదా ఏదైన నూతన వస్త్రంలో చుట్టి ఉంచాలి. పూజకు ముందు ఆ తర్వాత కూడా శంఖాన్ని నీటితో కడిగేయాలి. ఎప్పటికప్పుడు శుభ్రంగా పెట్టాలి.
నీటి శంఖాన్ని ముఖ్యంగా విష్ణు పాదాల వద్ద పెట్టవచ్చు. నీటి శంఖంలో ఎప్పుడూ నీరు ఉండేలా జాగ్రత్త పడాలి. దాన్ని ఓ పవిత్ర వస్త్రంలో చుట్టి పెట్టాలని పండితులు సూచిస్తారు.

Read more RELATED
Recommended to you

Latest news