ఫోన్ పోతే ఇలా కనుక్కోండి…!

-

రోజు వందలాది మంది ఏదోక సందర్భంలో తమ స్మార్ట్ ఫోన్స్ ని పోగొట్టుకోవడం అనేది మనం చూస్తూనే ఉంటాం. అయితే ఆ స్మార్ట్ ఫోన్ ని పట్టుకోవడం అనేది చాలా కష్టం. పోలీసులకు కంప్లైంట్ ఇవ్వడం వాళ్ళు ఎప్పటికో స్పందించడం వంటివి జరుగుతూ ఉంటాయి. స్మార్ట్ ఫోన్ లో వ్యక్తిగత విలువైన సమాచారం ఉంటుంది. ఫోటోలు వీడియోలు ఇలా ఉంటాయి. దీనితో భయం కూడా ఉంటుంది.

అలాంటి వారికి మీ స్మార్ట్‌ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు కొన్ని ఫీచర్స్ సహకరిస్తూ ఉంటాయి. ఐఫోన్ లో ఉండే ఫైండ్ మై ఫోన్ ఫీచర్ కూడా అలాగే ఉపయోగపడుతుంది. గూగుల్‌ సెర్చ్ ఇంజిన్‌లో Find my Phone అని టైప్ చేస్తే లింక్ వస్తుంది. ఆ లింక్ క్లిక్ చేసి మీ జీమెయిల్ అకౌంట్‌తో లాగిన్ చేస్తే మీ ఫోన్ ఎక్కడ ఉందో కనిపిస్తుంది. అలాగే గూగుల్ మ్యాప్స్ ఉపయోగించి మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకోవచ్చు.

ఎందుకంటే గూగుల్ మ్యాప్స్ మీ ప్రతీ కదలికను రికార్డ్ చేస్తుంది. ఆ వివరాలన్నీ టైమ్‌లైన్‌లో ఉంటాయి. www.maps.google.co.in ఓపెన్ చేసి మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. త్రీ డాట్స్ పైన క్లిక్ చేస్తే ‘Your timeline’ అని కనిపిస్తుంది. అది క్లిక్ చేస్తే అందులో మీరు ఏ రోజు ఎక్కడ ఉన్నారు? ఎంత సేపు ఉన్నారు? అనే వివరాలు ఉంటాయి. ఈ రోజు మీ ఫోన్ ఎక్కడ ఉందో తెలుసుకునేందుకు ‘Today’ పైన క్లిక్ చేస్తే చాలు. చివరిసారిగా మీ ఫోన్ ఎక్కడుందో తెలుస్తుంది. ఇలా మీ ఫోన్ ని గుర్తించవచ్చు.

Read more RELATED
Recommended to you

Exit mobile version