చిన్నవయసులో ఏర్పడే అధిక కొలెస్టరాల్ ను ఎలా తగ్గించుకోవాలంటే..?!

-

ప్రస్తుత కాలంలో చాలామంది ఎదుర్కునే ప్రధాన సమస్యల్లో అధిక కొలెస్ట్రాల్‌ ఒకటి. కాని అన్ని కొలెస్ట్రాల్ చెడ్డవి కాదు. అధిక సాంద్రత కలిగిన లిపోప్రొటీన్లు లేదా హెచ్‌డిఎల్‌ ను మంచి కొలెస్ట్రాల్ అని కూడా పిలుస్తారు. ఈ కొలెస్ట్రాల్‌ స్థాయిలు ఆరోగ్యానికి మంచివి. అదే తక్కువ సాంద్రత కలిగిన లిపోప్రొటీన్ లేదా ఎల్‌డిఎల్‌ ను చెడు కొలెస్ట్రాల్ అని అంటారు. ఈ కొలెస్ట్రాల్‌ ఆరోగ్యానికి మంచిది కాదు. ఎందుకంటే ఈ కొలెస్ట్రాల్‌ అధికంగా ఉండడం వల్ల అధిక స్థాయిలో గుండె జబ్బుల వచ్చే ప్రమాదం ఉంది.

bad cholesterol
bad cholesterol

అధిక కొలెస్ట్రాల్‌ కు వ్యతిరేకంగా నివారణ చర్యలు తీసుకోవడం వల్ల చిన్న వయస్సులోనే అధిక కొలెస్ట్రాల్ ప్రమాదం నుండి బయటపడవచ్చు. అయితే, ఈ క్రింది విధంగా మన జీవనశైలిని మార్పు చేసుకుంటే గుండె సంబంధిత ఆరోగ్య సమస్యల ప్రమాదాన్ని తగ్గించడానికి సహాయపడతాయి. అవేంటో తెలుసుకుందాం.. ముందుగా వ్యాయామం చేయడం అనేది మన జీవన శైలిలో ఒక భాగంగా మార్చుకోవాలి.

ప్రతిరోజూ కనీసం 30 నిమిషాల పాటు మీకోసం మీరు స‌మ‌యాన్ని కేటాయించి .వ్యాయామం చేయడం వల్ల అదనపు కొవ్వును క‌రిగించ‌వచ్చు. అలాగే చెడు కొవ్వులు ఉన్న ప‌దార్థాల‌కు దూరంగా ఉండండి. సంతృప్త కొవ్వులు, ట్రాన్స్ ఫ్యాట్స్ మీ ఆరోగ్యానికి చెడ్డవి అలాగే ఎల్డిఎల్ స్థాయిలు పెరగడానికి దారితీస్తాయి. మోనోఅన్‌శాచురేటెడ్ కొవ్వు, ఒమేగా -3 కొవ్వు ఆమ్లాల వంటి బహుళ అసంతృప్త కొవ్వులతో కూడిన ఆహారం మీ గుండె ఆరోగ్యానికి మంచిది ఎల్‌డిఎల్ స్థాయిలను తగ్గించడంలో సహాయపడుతుంది.

అందుకనే డీప్ ఫ్రైడ్, ఫ్రైడ్ ఫుడ్స్ చాలావరకు తగ్గించాలి. వాటికి బదులుగా చేపలు, ఆలివ్, గింజలు, మొలకెత్తిన విత్తనాలు వంటి ఆరోగ్యకరమైన కొవ్వుల కలిగిన పదర్ధాలను తినాలి. అలాగే కొలెస్ట్రాల్‌ ను తగ్గించాలంటే ఎక్కువ ఫైబర్ తీసుకోవాలి. పండ్లు, కూరగాయలు, తృణధాన్యాలు, కాయలు, విత్తనాల వంటి ఆహారంలో ఫైబర్ అధికంగా ఉంటాయి. ఇది మీ గుండె ఆరోగ్యానికి గొప్పది. కూరగాయలను ఎక్కువగా తినండి.

ఇంకొక ముఖ్య విషయం ఏంటంటే ధూమపానం మానుకోండి. ధూమపానం మీ ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. ఈ చెడు అలవాటు హెచ్‌డిఎల్ స్థాయిలను తగ్గిస్తుంది. అలాగే మొత్తం కొలెస్ట్రాల్ స్థాయిలను పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ధూమపానం చేసేవారికి ధమనులు మూసుకుపోయే అవకాశం ఉంది. ఇది గుండె జబ్బులకు అధిక ప్రమాద కారకం. అలాగే మద్యం సేవించడం కూడా మానెయ్యాలి. మద్యపానాన్ని పరిమితం చేయండి. చాలా మితమైన మద్యం తాగడం వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడుతుందని చాలా అధ్యయనాలు చూపించాయి, ప్రతిరోజూ ఎక్కువగా తాగడం వల్ల మీ ఎల్‌డిఎల్ స్థాయిలను పెంచుతుంది. అలాగే మీ కాలేయాన్ని కూడా దెబ్బతీస్తుంది. కాబట్టి ఆల్కహాల్ తీసుకోవడం పరిమితం చేయడం చాలా ముఖ్యం.

Read more RELATED
Recommended to you

Latest news