ఎంతో ఇష్టపడి కొనుక్కున్న దుస్తులపై మరకలు పడితే వాటిని పక్కన పెట్టవలసిన అవసరం లేదు. ఇంట్లోనే కొన్ని చిట్కాలతో ఆ మరకలను పోగొట్టవచ్చు. దుస్తులపై ఆల్కహాల్, లిప్స్టిక్, ఆహార పదార్థాలు, గోరింటాకు ఇలా ఎన్నో మరకలు అవుతాయి ఒక్కో మరకకు ఒక్కో పరిష్కారం ఉంటుంది.
కొత్త దుస్తులు ఉతికేటప్పుడు నీటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి ఉతికితే రంగు వదలవు. ఇలా చేయడం వల్ల దుస్తుల మెరుపు ఎప్పటికి తగ్గదు.
దుస్తులపై నూనె మరకలు పడినప్పుడు వాటిపై చాక్పీస్ రుద్ది, అప్పుడు ఉతకండి ఇలా చేయడం వల్ల చాక్పీస్ నూనె ను పీల్చుకొని మరక త్వరగా పోతుంది.
దుస్తులకు గోరింటాకు మరకలు అంటుకుంటే మరక ఉన్న చోట వేడి పాలలో నానబెట్టి ఆ తరువాత డిటర్జెంట్ ఉతకాలి.
బట్టల మీద ఆల్కహాల్ మరకలు పోవాలంటే సోడా నీటిలో ముంచాలి లేదా సోడాలో కొద్దిగా నీటిని కలిపి పేస్టులా చేసుకుని ఆ పేస్టు ని మరకపై పట్టించాలి.
సింథటిక్ బట్టలు పై మరకలు పోగొట్టడాని కి డిటర్జెంట్ వాడడం మంచిది. బ్లీచ్ వాడటం వల్ల దుస్తులు ఎక్కువ రోజులు మన్నవు.
కాటన్ దుస్తులపై మరకలు పోగొట్టడానికి ఎటువంటి ప్రయత్నమైనా చేయొచ్చు, ఏం చేసినా సరే కాటన్ బట్టలు ఎక్కువ రోజులు మన్నుతాయి.
ఉన్ని దుస్తుల పై నూనె ఒలికితే కొంచెం పెరుగు వేసి రుద్దండి, మరకలు త్వరగా వదిలిపోతాయి.