ప్రామిస్ డే ప్రాముఖ్యత.. విశేషాలు.. కొటేషన్లు.

-

వాలెంటైన్స్ డే కి మూడు రోజుల ముందు వచ్చే రోజుని ప్రామిస్ డే గా జరుపుకుంటారు. ప్రేమికుల రోజుకి వారం రోజుల ముందు నుండి మొదలయ్యే ఒక్కో రోజుకి ఒక్కో విశిష్టత ఉంటుంది. రోజ్ డే, ప్రపోజ్ డే, చాక్లెట్ డే, టెడ్డీ డే, ప్రామిస్ డే ఇలా ఒక్కో రోజు ఒక్కో ఫీలింగ్ ని బయటపెట్టేందుకు ఒక్కో రోజుని ఒక్కో విధంగా జరుపుకుంటారు. ప్రామిస్ డే రోజున మీరు ప్రేమించిన వారికి మాట ఇవ్వాల్సి ఉంటుంది. జీవితకాలం మొత్తం తమతోనే జీవిస్తానని, కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా నీ చెయ్యి వదలనని మాటిస్తూ ప్రామిస్ చేయాల్సి ఉంటుంది.

ఇద్దరి మధ్య కలకాలం కొనసాగాలంటే వారిద్దరూ తమ మాటలకు కట్టుబడి ఉండాలి. అందుకే ప్రామిస్ డే రోజున మనం చెప్పే మాటలు ఊరికే నోటి నుండి వచ్చినవి కాకుండా మనసులోంచి వచ్చినవై ఉండాలి. ఈ ప్రామిస్ డే రోజున మీరు ప్రేమిస్తున్న వారికి ధైర్యాన్నిచ్చేలా మీరు తమతో ఎప్పటికీ ఇలాగే ఉంటారని ప్రామిస్ చేయండి.

ప్రామిస్ డే కొటేషన్లు..

జీవితంలో ఎన్ని అడ్డంకులు వచ్చినా వాటన్నింటినీ దాటుకుని ఆనందాన్ని నాతో పాటు తీసుకొస్తూ ఎల్లప్పుడూ నీ పక్కనే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను. హ్యాపీ ప్రామిస్ డే.

నీ అందమైన కళ్ళలో నుండి ఒక కన్నీటి చుక్క బయటకి రాకుండా నీ పెదవుల మీద అందమైన నవ్వు విరిసేలా చూసుకుంటానని ప్రామిస్ చేస్తున్నా.. హ్యాపీ ప్రామిస్ డే.

అన్ని సమస్యలని దూరం చేస్తానని ప్రామిస్ చేయను. కానీ సమస్యలతో పోరాడే నీ పక్కన ఉంటూ నీతో పాటు పోరాడతానని, జీవితం చివరి వరకూ నీ పక్కనే ఉంటానని ప్రామిస్ చేస్తున్నాను, హ్యాపీ ప్రామిస్ డే.

Read more RELATED
Recommended to you

Latest news