పెట్టుబడుల పేరుతో భారీ మోసం.. ముఠా అరెస్ట్

-

చైనా కేంద్రంగా పెట్టుబడులు పేరుతో భారీ మోసానికి పాల్పడింది ఓ ముఠా. చిక్కడపల్లికి చెందిన బాధితులు ఇచ్చిన ఫిర్యాదుతో ఈ ముఠాను పట్టుకున్నారు పోలీసులు. టెలిగ్రామ్ యాప్ ద్వారా రేట్ అండ్ రివ్యూ పేరుతో బాధితుడికి పార్ట్ టైం జాబ్ ఆఫర్ వచ్చింది. Travelling-boost–99.com లో బాధితుడు రిజిస్టర్ చేసుకున్నాడు. ఆ తరువాత ఈ వెబ్సైట్ ద్వారా బాధితుడికి ఐదు టాస్కులు వచ్చాయి.

వెయ్యి రూపాయలు ఇన్వెస్ట్ చేస్తే 866 రూపాయల ప్రాఫిట్ బాధితుడికి లభించింది. ప్రతిసారి బాధితుడు ఇన్వెస్ట్ చేసిన ప్రతి దానికి సంబంధించిన నగదు ఆన్లైన్ వాలెట్ లో డిస్ప్లే అయ్యేది. కానీ ఆన్లైన్ విండోలో చూపించిన అమౌంట్ ని మాత్రం బాధితుడు విత్ డ్రా చేసుకోవడానికి వీలు ఉండేది కాదు. అలా మొత్తం 28 లక్షల రూపాయలను పోగొట్టుకున్నాడు బాధితుడు. అతను పోగొట్టుకున్న 28 లక్షల రూపాయలు ఆరు అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ అయినట్లుగా గుర్తించారు పోలీసులు.

ప్రధానంగా రాధిక మార్కెటింగ్ పేరుతో ఉన్న అకౌంట్లోకి ముందుగా డబ్బుంతా ట్రాన్స్ఫర్ అయ్యేదని.. ఆ తర్వాత అక్కడి నుండి పలు బ్యాంకుల్లో ఉన్న అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసేవారని గుర్తించారు. ఇందుకోసం నిందితులు పలు బ్యాంకుల్లో అకౌంట్లను సిద్ధం చేసి ఉంచుకున్నారు. బ్యాంకు అకౌంట్లో పాటు షెల్ అకౌంట్లు రెడీగా ఉంచుకున్నారని తెలిపారు. ఈ రాధిక మార్కెటింగ్ అకౌంటు హైదరాబాద్ కి చెందిన మహమ్మద్ మున్వర్ మైంటైన్ చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. ఈ మొత్తం ఫ్రాడ్ లో చైనాకు చెందిన లు ల్యో, నాన్ యే, కెవిన్ జూన్ లు ప్రధాన నిందితులని పోలీసులు గుర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news