శ్రీలంక స్టార్ క్రికెటర్: నా రిటైర్మెంట్ కు చాలా కారణాలు ఉన్నాయి … ఇప్పుడు చెప్పలేను !

-

ఒక దేశానికి ఒక స్పోర్ట్ లో రిప్రెజెంట్ చేయడమంటే మాములు విషయం కాదు. కానీ ఏదో ఒక సమయంలో వీడ్కోలు చెప్పక తప్పదు.. తాజాగా శ్రీలంక క్రికెట్ లో కీలక ప్లేయర్ గా ఎదిగిన స్టార్ క్రికెటర్ లాహిరి తిరిమన్నే కాసేపటి క్రితమే అన్ని ఫార్మాట్ ల నుండి రిటైర్ అవుతున్నట్లు ప్రకటించాడు. లెఫ్ట్ హ్యాండ్ బాట్స్మన్ అయిన తిరిమన్నే ఎన్నో మ్యాచ్ లలో శ్రీలంకకు విజయాలను అందించాడు. ఈ బాధాకరమైన సమయంలో తిరిమన్నే సోషల్ మీడియా వేదికగా చెప్పిన కొన్ని మాటలు ఇతను అభిమానులకు బాధను కలిగిస్తున్నాయి అని చెప్పాలి. తిరిమన్నే… ఈ మెసేజ్ లో నేను నా దేశానికి చాలా నిబద్దతతో మరియు బాధ్యతతో ఆడాను. ఈ సమయం నాకు చాల కష్టమని తెలుసు , కానీ వెళ్లిపోక తప్పదు.. నా ఈ రిటైర్మెంట్ వెనుక అనేక కారణాలు ఉన్నాయి. కానీ ఇప్పుడు వాటి గురించి చెప్పలేను. నా కెరీర్ అంతటా నాకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదములు అంటూ ముగించాడు.కాగా ఇతను తన కెరీర్ లో శ్రీలంక తరపున 44 టెస్ట్ లు , 127 వన్ డే లు మరియు 26 టీ 20 లు ఆడాడు. అన్ని ఫార్మాట్ లలో కలిపి 5543 పరుగులు చేశాడు.

Read more RELATED
Recommended to you

Latest news