దేశంలో భారీ హ్యాకింగ్..!దేశ ప్రజలకు మోడి సర్కార్ హెచ్చరిక..!

-

govt of india urges the country to be aware from hackers
govt of india urges the country to be aware from hackers

హ్యాకర్ల గుప్పిట్లో దేశం పడబోయే ప్రమాదం పొందిగా ఉందని భారతీయ కంప్యూటర్, అత్యవసర స్పందన సంస్థ  (సెర్ట్ ఇన్‌) పేర్కొంది. కరోనా వీరవిహంగంగా విజృంభిస్తున్న నేపద్యంలో ఆ కరోనాణే అస్త్రంగా మార్చుకొని హ్యాకర్లు దాడి చేసే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని ఆ సంస్థ హెచ్చరించింది. దేశ ప్రజల వ్యక్తిగత, ఆర్థిక సమాచారం తస్కరణకు గురయ్యే ప్రమాదం ఉందని, దీనిపై అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించింది.

ఈ క్లిష్ట సమయంలో ఫ్రీ గా చికిత్సలు పరీక్షలు నిర్వహిస్తామని మెయిల్ చేసి ఆ మెయిల్ కి ఆకర్షితులైన వారి పూర్తి సమాచారాన్ని హ్యాక్ చేయబోతారని ఆ సంస్థ వెల్లడించింది. ప్రభుత్వ ఉద్యోగులమంటూ ప్రభుత్వం తరఫునా మాట్లాడుతున్నామని [email protected] వంటి ఈ-మెయిల్స్‌ను వినియోగిస్తూ ఇటువంటి చర్యకు పాల్పడవచ్చని ఆ సంస్థ సూచిస్తుంది. దేశ ప్రజలు ఇటువంటి మెయిల్స్ కి స్పందించవద్దని.. అటువంటి మెయిల్స్ వస్తే డిలీట్ చేయాలని అందరినీ అప్రమత్తంగా ఉండమని ఆ సంస్థ కోరుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news