కొత్తగా ఇల్లు కట్టుకునే వారికి బిగ్ షాక్ తగిలింది. మరోసారి సిమెంట్ ధరలు పెరిగే అవకాశం ఉందని ఎమ్ కే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ అభిప్రాయపడింది. బస్తాకు రూ. 10 నుంచి రూ. 15 వరకు పెరిగే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది.
ఈ ఏడాది ఆగస్టు నెల నుంచి బస్తా సిమెంట్ కు రూ. 16 చొప్పున పెరిగింది. ప్రస్తుతానికి ఈ అంశం చర్చల దశలోనే ఉందని, కొద్ది రోజుల్లో దీనిపై కంపెనీలు ప్రకటన చేసే అవకాశం ఉందని ఎమ్ కే గ్లోబల్ వెల్లడించింది.
ఈ ఏడాది ఆగస్టు-సెప్టెంబర్ మధ్య కాలంలో సిమెంట్ బస్తా రేటు 16 రూపాయలు పెరిగింది. నవంబర్‌లో మరో ఆరేడు రూపాయలు పెంచారు. ఇప్పుడు మళ్లీ పెంచేందుకు రంగం సిద్ధమవుతోంది. ఈ విషయాన్ని ఎంకే గ్లోబల్ ఫైనాన్షియల్ సర్వీసెస్ లిమిటెడ్ తెలిపింది. దేశంలోని పశ్చిమ మరియు మధ్య ప్రాంతాల్లో సిమెంట్ ధరలు ఫ్లాట్‌గా ఉండగా.. ఉత్తర, తూర్పు మరియు దక్షిణ ప్రాంతాల్లో కొంచెం హార్డ్‌గానే ఉన్నాయని వివరించింది.