రష్యా ఉక్రెయిన్ మధ్య జరిగిన యుద్ధ ప్రభావం మన దేశంపై కూడా పడుతోంది. దీనితో సామాన్యులకి చుక్కలు కనపడనున్నాయి. దేశంలో పలు వస్తువుల ధరలు భారీగా పెరిగేలా కనపడుతోంది. బంగారం కూడా పెరిగిపోయింది. అలానే వంట నూనె ధరలు పెరుగుతూనే వున్నాయి. ఇక పూర్తి వివరాల లోకి వెళితే…
ఆయిల్ ధరలు రానున్న రోజుల్లో మరింత పెరగొచ్చని అంచనాలు ఉన్నాయి. అలానే గ్రాసరీ ఐటమ్స్, స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్స్, ఇంపోర్టెడ్ కాస్మటిక్స్, వాచీలు కూడా పెరిగేలా కనపడుతోంది. కమొడిటీ ధరలు పెరుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఇండియన్ రూపాయి బలహీనపడింది.
అలానే కన్సూమర్స్ గూడ్స్ ధరలు 10 శాతం వరకు, వంట నూనె ధరలు 20 శాతం వరకు పెరిగేలా కనపడుతోంది. ఇప్పటికే వంట నూనె ధరలు పెరిగాయి. ఈ మూలంగానే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు.ముఖ్యంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ రేటు బాగా పెరిగింది. 15 రోజుల కిందట లీటరు రూ. 150 వద్ద ఉన్న నూనె ఇప్పుడు రూ. 190కి చేరుకుంది.
అలానే మార్కెట్ లో పామాయిల్‌కు డిమాండ్ పెరిగింది. రూ. 130గా ఉన్న లీటర్ పామాయిల్ ధర ఇప్పుడు రూ. 170కి చేరుకుంది. ఇక వేరుశనగ నూనె లీటర్ ధర రూ. 150 నుంచి రూ. 200కు పెరిగింది. ఈ మూలంగా సామాన్యులకి ఇక్కట్లు తప్పడం లేదు.