సలార్ థియేట్రికల్ రైట్స్ కు భారీ ధర..!

-

పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో, కేజీఎఫ్ సిరీస్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న ఔట్ అండ్ ఔట్ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ సలార్. ఈ చిత్రం ను సెప్టెంబర్ 28, 2023 న వరల్డ్ వైడ్ గా థియేటర్ల లో గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు. ఈ పాన్ ఇండియా మూవీ కి సంబందించిన టీజర్ ను మేకర్స్ ఇటీవల రిలీజ్ చేశారు. ఈ టీజర్ కి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది.


ఈ టీజర్ కి సెన్సేషన్ రెస్పాన్స్ వస్తోంది. టీజర్ సినిమా పై ప్రేక్షకుల్లో, అభిమానుల్లో భారీ అంచనాలు పెంచేసింది.
అయితే తాజాగా ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ రైట్స్ కి సంబందించిన న్యూస్ పై ఒక క్లారిటీ వచ్చింది. దాదాపు 200 కోట్ల రూపాయలకి థియేట్రికల్ రైట్స్ అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. నైజాం 72 కోట్ల, సీడెడ్ 35 కోట్లు, ఆంధ్ర 90 కోట్ల రూపాయలకి పైగా అమ్ముడయినట్లు తెలుస్తోంది. అయితే వీటిపై మరింత క్లారిటీ రావాల్సి ఉంది. ఈ చిత్రం లో శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా, పృధ్వీ రాజ్, జగపతి బాబు, శ్రియా రెడ్డి లు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం కోసం ప్రేక్షకులు, అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news