ఈరోజుల్లో బయట ఏది కొనాలన్నా భయమేస్తుంది. అన్ని నకిలీ ఉత్పత్తులే ఉంటున్నారు. ఇంట్లో వాడే సరుకులను కల్తీ చేస్తున్నారు. కూరగాయలను కూడా అంతే.. ప్రమాదకరమైన రసాయనాలతో పండించడం వల్ల వాటిని తినడం వల్ల ఎలాంటి ప్రయోజనం లేకపోగా ఇంకా రోగాలను కొని తెచ్చుకుంటున్నారు. ఆకుకూరలు తినండి ఆరోగ్యానికి మంచిది అని అందరూ అంటారు. కానీ ఆకుకూరలు ఫ్రష్‌గా ఉండాలని చాలా మంది ఓ ప్రమాదకరమైన రసాయనాన్ని వాటిపై చల్లుతున్నారు. దాంతో అది ఎంత వాడిపోయినా తాజాగా కనిపిస్తుంది. అసలు ఈ వీడియో చూస్తే..మనం బయట ఆకుకూరలు కొనడానికి భయపడతాం. ఎందుకంటే.. మీరు గమనించే ఉంటారు.. ఆకుకూరలు అమ్మే వాళ్లు ఎప్పుడూ వాటిపై ఓ బాటిల్‌లో వాటర్‌ను చల్లుతూ ఉంటారు.మనం అవి కేవలం నీళ్లు అనుకుంటారు. కానీ వాళ్లు ఇప్పుడు అందులో ఏం కలిపారో అని భయపడాల్సి వస్తుంది. అదేంటో మార్కెట్‌లో ఉన్నప్పుడు ఆకుకూరలు తాజాగానే ఉంటాయి, ఎప్పుడైతే ఇంటికి తెస్తామో మరుసటి రోజుకే వాడిపోతాయి.!
A two minute real life horror story. 😱 pic.twitter.com/gngzaTT56q
— Amit Thadhani (@amitsurg) March 17, 2023
రసాయనాలను ఉపయోగించి తాజాగా కనిపించే కూరగాయలను ఎలా తయారు చేయాలో ఈ వీడియో చూపిస్తుంది. వీడియోలో, ఒక వ్యక్తి వాడిపోయిన ఆకు కూర కట్టను ఒక వాటర్ బకెట్‌లో ముంచుతాడు. ఆ వాటర్‌లో ఏదో రసాయనం ముందే ఉంటుంది. ఆ వాటర్‌లో ఈ ఆకుకూర కట్టను ముంచగానే అది ఫ్రష్‌గా కనిపిస్తుంది. అదేదో పువ్వు విచ్చుకున్నట్లు ఆ వాడిపోయిన ఆకుకూర విచ్చుకుని ఫ్రష్‌గా కనిపిస్తుంది.
ఈ ద్రావణానికి కాపర్ సల్ఫేట్, రోడమైన్ ఆక్సైడ్, మలాకైట్ గ్రీన్ మరియు కాల్షియం కార్బైడ్ వంటి రసాయనాలను ఉపయోగిస్తారు. ఈ వీడియో వైరల్‌గా మారడంతో పలువురు తాము తినే ఆహారంలో విషపదార్థాలు పెరుగుతాయని ఆందోళన వ్యక్తం చేస్తూ ట్వీట్లు చేస్తున్నారు. బయట కూరగాయలు కొనేప్పడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మన కర్మ ఏంటో.. కల్తీ వాటిని కూడా ఖరీదుగా కొనాల్సి వస్తుంది. వీలైనంత వరకూ ఇంట్లోనే మనకు సరిపడా కూరగాయలను పెంచుకోవడం చాలా ఉత్తమం. సిటీల్లో ఉంటే ఎక్కడ అవుతుంది అని చాలా మంది లైట్ తీసుకుంటారు. టెర్రస్ మీదనే ఇంటి ముందునే ఎక్కడో ఒక దగ్గర పూల మొక్కల పెంచే ప్లేస్‌లో కూరగాయల మొక్కలు వేసి ఆర్గానిక్‌గా పెంచితే వాటిని తినేరోజు మీకు చాలా హ్యాపీగా ఉంటుంది. ఇందులో ఎలాంటి రసాయనాలు వాడలేదు అనే ఫీల్ చాలా బాగుంటుంది.