ఏపీలో భారీ ఎత్తున నమోదవుతున్న పోలింగ్

Join Our Community
follow manalokam on social media

ఆంధ్రప్రదేశ్ రెండో విడత పంచాయతీ ఎన్నికలు ఈ రోజు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకు దాదాపు 25 శాతానికి పైగా పోలింగ్ నమోదయింది.. అలాగే కొన్ని మండలాల్లో 40 శాతానికి పైగా ఓట్లు పోల్ అయినట్లు చెబుతున్నారు. మొదటి దశ కంటే ఈ రోజున భారీ ఎత్తున జనం ఓటింగ్ కోసం తరలి వస్తున్నట్లు సమాచారం అందుతోంది. కొన్ని స్వల్ప ఘటనలు మినహా పోలింగ్ ప్రశాంతంగానే జరుగుతున్నట్లు చెబుతున్నారు.

కొన్ని గ్రామాలలో టిడిపి వైసిపి వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లా అనంతపురం జిల్లా లాంటి చోట్ల వైసీపీ టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. గుంటూరు జిల్లాలో నరసింగపాడు అనే గ్రామంలో గుర్తులు తారుమారయ్యాయి. దీంతో ఓటింగ్ నిలిపివేశారు…మరోపక్క విజయనగరం జిల్లాలో కూడా ఒక గ్రామంలో గుర్తులు చూపించి వైసీపీ కార్యకర్తలు ఓటేయాలని చెబుతున్నారని టిడిపి కార్యకర్తలు ఆరోపిస్తున్నారు. దీంతో వైసీపీ టీడీపీ కార్యకర్తల మధ్య గొడవ జరిగింది. పోలీసుల రంగప్రవేశంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారకుండా ఉంటున్నాయి.

TOP STORIES

రూపాయి ఫీజు.. రిటైర్డ్ టీచర్ క్లాస్..!

రిటైర్‌మెంట్ తీసుకున్న ఉద్యోగులు వృద్ధాప్య జీవితాన్ని ఏదోఒక కాలక్షేపంతో కానిచ్చేస్తుంటారు. మనవళ్లకు ఆటపాటలు నేర్పిస్తూ కాలం గడుపుతుంటారు. కానీ బీహార్‌లోని సమస్తిపూర్‌కు చెందిన 61ఏళ్ల లోకేశ్...