వంట నూనె ధరలు తగ్గడం తో సామాన్యులకు భారీ ఊరట కలిగించనుంది. మోదీ సర్కార్ వంట నూనెలపై బేస్ దిగుమతి ధరలను తగ్గిస్తూ కీలక ప్రకటన చేసింది. ఇక దీనికి సంబంధించి పూర్తి వివరాల లోకి వెళితే..
అంతర్జాతీయ మార్కెట్ లో వంట నూనె ధరలు తగ్గాయి. దీనితో కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఇక రేట్లు గురించి చూస్తే.. క్రూడ్ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1222 డాలర్ల నుంచి 1136 డాలర్లకు తగ్గించింది. అదే విధంగా క్రూడ్ సోయా ఆయిల్ ధరను టన్నుకు 1452 డాలర్ల నుంచి 1415 డాలర్లకు తగ్గించడం జరిగింది.
ఆర్‌బీడీ పామ్ ఆయిల్ ధరను టన్నుకు 1245 డాలర్ల నుంచి 1148 డాలర్లకు తగ్గాయి. ఇది ఇలా ఉంటే కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ తాజా గణాంకాల ప్రకారం వంట నూనె ధరలు దాదాపు 20 శాతం వరకు తగ్గాయని అనచ్చు.
ఇక రేట్లు ఎలా వున్నాయి అనేది చూస్తే.. ముంబై మార్కెట్ ప్రకారం మే 7న పామాయిల్ ధర కేజీకి రూ.142గా ఉంటే ఇప్పుడు రూ.115కు తగ్గింది. అదే విధంగా సన్‌ఫ్లవర్ ఆయిల్ ధర కూడా తగ్గింది. మే 5న ధర కేజీకి రూ.188 గా ఉంటే.. ఇప్పుడు ఈ రేటు రూ.157 తగ్గింది. అంటే 16 శాతం క్షీణించింది.
సోయా ఆయిల్ అయితే 15 శాతం క్షీణతతో కేజీకి రూ.138కు తగ్గింది. ఆవాల నూనె ఇప్పుడు రూ.157 క్షీణించింది. వేరు శనగ నూనె ధర కూడా రూ.174కు దిగొచ్చింది. ఇప్పుడు వనస్పతి ధర రూ.141కు తగ్గింది.