హైదరాబాద్‌లో భారీ చోరీ… వజ్రాలు, జాతిరత్నాలు ఎత్తుకెళ్లిన దొంగలు

-

హైదరాబాద్: నగరంలో దొంగలు రెచ్చిపోయారు. శివారుల్లో బీభత్సం సృష్టించారు. భారీగా దోచుకెళ్లారు. ఈ చోరీ హయత్ నగర్ పరిధిలో జరిగింది. వ్యాపారి, జ్యోతిష్యుడు అయిన మురళి వజ్రాలు వ్యాపారం చేస్తున్నారు. ఈ నెల 10న రూ. 1 కోటి 50 లక్షల విలువైన వజ్రాలు, జాతి రత్నాలను ఆయన ఇంట్లో పెట్టారు. ఆ తర్వాత వీటిలో కొన్ని షాపునకు తీసుకెళ్లారు. మిగిలినవి ఇంట్లోనే ఉంచారు. ఈ నెల 15న ఆయన ఇంట్లో లేని సమయంలో దొంగలు పడ్డారు. దాదాపు 40 లక్షల రూపాయల విలువైన వజ్రాలు, జాతి రత్నాలు ఎత్తుకెళ్లారు. మురళి నగరంలో మూడు దుకాణాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలో తన నివాసంలో దొంగతనం జరిగింది. దీంతో ఆయన ఎల్బీనగర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే ఇటీవల కాలంలో నగర శివారులో వరుస చోరీలు జరిగాయి. తాళాలు వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని దొంగలు చోరీలు చేశారు. పలు కాలనీల్లో రెక్కీ నిర్వహించారు. ఎల్‌బీనగర్ పరిసర ప్రాంతాల్లో దొంగతనాలు జరిగాయి. రూ. 32 లక్షల విలువైన 94 తులాల బంగారు ఆభరణాలను ఎత్తుకెళ్లారు. యూపీకి చెందిన భరత్ భూషణ్ భన్సల్, మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన మత్తు ప్రతాప్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరూ పాత నేరస్తులిగా గుర్తించారు. తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో భరత్‌పై 60 కేసులు..ప్రసాద్‌పై కూడా అధిక కేసులున్నాయని పేర్కొన్నారు. వీరి నుంచి సమాచారం సేకరించి వ్యాాపారి మురళి ఇంట్లో జరిగిన కేసును ఛేదించే అవకాశం కనిపిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news