మానవ లాలాజలం పాము విషం కంటే డేంజర్ : జపాన్ శాస్త్రవేత్తలు

-

జపాన్‌లోని ఒకినావా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ పరిశోధకులు ఒక కొత్త విషయాన్ని కనుగొన్నారు. పిట్ వైపర్ పాము విషంతో సమానమైన ఒక జన్యువును మనిషిలో గుర్తించారు. మనిషి కూడా పాములాంటి విషాన్ని ఉత్పత్తి చేయగలడని జపాన్ శాస్త్రవేత్తలు తెలిపారు. కాగా, ఇప్పటివరకు సరీసృపాలు, క్షీరదాల్లో మాత్రమే నోటిలో విషాన్ని తయారు చేసుకునే లక్షణం ఉంది. ఇటీవల జరిపిన పరిశోధనలో మనిషి పాముల వంటి విషాన్ని ఉత్పత్తి చేయగలడని తెలిసింది. దీంతో అందరూ ఆశ్చర్యానికి లోనయ్యారు. మనిషి కూడా తన లాలాజలాన్ని పాములా విషపూరితం చేయగలడని పరిశోధనలో తేలింది.

snake
snake

వాస్తవానికి ఒకినావా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్ యూనివర్సిటీ పరిశోధకులు తైవాన్ హబు పిట్ వైపర్‌పై అధ్యాయనం చేశారు. ఇందులో పాముల విషంలా మనిషి లాలాజలంలో ఉండే ఒక జన్యువును కనుగొన్నారు. క్షీరదాలు, సరీసృపాలు ఇప్పటికే నోటి ద్వారా విషాన్ని అభివృద్ధి చేయగలవు. మనుషులు కూడా విషాన్ని తయారు చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. దీని ప్రకారం మనుషులు కూడా సరీసృపాల వలే విషాన్ని ఉత్పత్తి చేయగలరని నిర్ధారించారు. ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాము రాటిల్ స్నేక్. అత్యంత విషపూరితమైన క్షీరదం డక్‌బిల్. వాటితో సమానమైన విషాన్ని మనిషి తన లాలాజలంతో తయారు చేసుకోగలడని శాస్త్రవేత్తలు వెల్లడించారు.

పాముల విష గ్రంథులు, మానవుడి గ్రంథుల మధ్య ఒక లింక్‌ను జపాన్ శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ మార్పు జన్యువుల వల్ల జరిగిందని, ఈ జన్యువులు లాలాజల గ్రంథులను విషపూరితం చేస్తాయన్నారు. జంతురాజ్యంలో జన్యువుల ప్రభావం వల్ల లాలాజల గ్రంథులు అవసరానికి అనుగుణంగా అభివృద్ధి చెందుతాయని ఒకినావా ఇనిస్టిట్యూట్ శాస్త్రవేత్త అగ్నిష్ బారువా తెలిపారు. పాముల వలే మానవుడు కూడా విషాన్ని ఉత్పత్తి చేయగలడని, కానీ, జన్యు సంబంధ కారణాల వల్ల లాలాజల గ్రంథులు ఆ విధంగా అభివృద్ధి చెందుతాయన్నారు. కోతి నోటిలో కూడా విషపు గ్రంథులు ఉంటాయి. లాలాజల గ్రంథుల అభివృద్ధి ద్వారా ఈ విషం ఏర్పడుతుందని ఆయన చెప్పుకొచ్చారు. దీని వెనుక మాలిక్యులర్ మెకానిక్స్ అనే రసాయనం పని చేస్తుందని, దీని వల్ల ఎవరి శరీరంలోనైనా విషం అభివృద్ధి చెందుతుందని అగ్నిష్ బారువా తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news