ఈ పండ్లు తీసుకుంటే వేసవిలో హైబీపీ వలన ఇబ్బందులు రావు..!

-

ఎక్కువగా వేసవి కాలం లో హై బ్లడ్ ప్రెషర్ ఇబ్బంది పెడుతూ ఉంటుంది. అయితే దానిని కంట్రోల్ చేసుకోవడానికి డైట్ లో కొన్ని మార్పులు చేస్తే సరిపోతుంది. ఆరోగ్యకరమైన ఈ పండ్లని మీరు తీసుకుంటే హై బీపీ వలన ఇబ్బంది రాకుండా ఉంటుంది. మరి ఆ పండ్ల గురించి ఇప్పుడే చూసేయండి..!

పుచ్చకాయ :

పుచ్చకాయ లో తక్కువ కేలరీలు ఉంటాయి. పైగా ఇది తియ్యగా, రుచిగా ఉంటుంది. మీరు పుచ్చకాయని మీ డైట్ లో చేర్చుకుంటే మంచి ప్రయోజనాలు ఉంటాయి. కావాలంటే సలాడ్ లేదా జ్యూస్ రూపంలో కూడా మీరు తీసుకోవచ్చు. పుచ్చకాయ లో విటమిన్ సి, విటమిన్ కె, పొటాషియం, అమైనో ఆసిడ్స్, సోడియం మరియు యాంటీ ఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. ఇది హై బీపీ తో పోరాడటానికి సహాయపడుతుంది.

మామిడి పండు:

మామిడి పండు అంటే అందరికీ ఎంతో ఇష్టం. దాని రుచి కూడా బాగుంటుంది.హైబీపీ వల్ల ఇబ్బంది రాకుండా ఉండడానికి మామిడిపండు కూడా సహాయపడుతుంది. ఎందుకు అంటే మామిడి లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. పైగా కెరోటీన్ కూడా ఎక్కువ ఉంటుంది. వీటి వల్ల బీపీ ను తగ్గిస్తుంది.

అరటి పండు:

అరటి పండు లో పొటాషియం ఎక్కువగా ఉంటుంది మరియు సోడియం తక్కువగా ఉంటుంది. ఇది బీపీ ని కంట్రోల్ చేయడానికి బాగా ఉపయోగపడుతుంది. అలానే గుండె సంబంధిత సమస్యలు మరియు స్ట్రోక్ వంటివి రాకుండా ఉండడానికి కూడా ఇది ఉపయోగపడుతుంది.

జీర్ణ సమస్యలను కూడా సులువుగా తరిమికొడుతుంది. వేసవిలో అరటి పండ్లు తీసుకోవడం వల్ల హై బ్లడ్ ప్రెషర్ వల్ల సమస్య రాకుండా కాపాడుతుంది.

స్ట్రాబెర్రీస్:

స్ట్రాబెర్రీస్ లో విటమిన్ సి, పొటాషియం, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అలానే ఇది హైబీపీ వల్ల సమస్య కలగకుండా ఉంచుతుంది.

Read more RELATED
Recommended to you

Latest news