తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. అయితే సీఎం కేసీఆర్ ను పరామర్శించేందుకు పలువురు పోలీసులతో వాదోపవాదనలు పెట్టుకుంటున్నారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ ఓ వీడియోను విడుదల చేశారు. దయచేసి సహకరించండి.. నాతోపాటు వందలాది పేషంట్లకు ఇబ్బంది కలగకూడదు.కోలుకుని త్వరలోనే మీ నడుమకు వస్తాను. ఇన్ఫెక్షన్ వస్తదని డాక్టర్లు నన్ను బయటకు పంపుతలేరు.
యశోద దవాఖాన కు రాకండి.. ప్రజలకు కేసీఆర్ విజ్ఞప్తి చేశారు. తన ఆరోగ్య పరిస్థితి గురించి తెలుసుకుని పరామర్శించడానికి యశోద దవాఖానకు తరలివస్తున్న ప్రజలకు బీఆర్ఎస్ అధినేత కెసిఆర్ విజ్ఞప్తి చేసారు. తాను ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నానని త్వరలో సాధారణ స్థితికి చేరుకుని మీ నడుమకే వస్తానని అప్పడిదాకా సంయమనం పాటించి యశోద దవాఖానకు రావొద్దని తనతో పాటు వందలాది మంది పేషెంట్లు హాస్పిటల్ లో ఉన్నందున మన వల్ల వారికి ఇబ్బంది కలగకూడదని ప్రజలను వేడుకున్నారు. తన పట్ల అభిమానం చూపుతున్న కోట్లాది ప్రజలకు కృతజ్ఞత తెలుపుతూ గద్గద స్వరం తో చేతులు జోడించి మొక్కారు. తనను చూడడానికి వచ్చి మీరూ ఇబ్బంది పడొద్దు… హాస్పటల్ లో ఉన్న పేషెంట్లను ఇబ్బంది పెట్టొద్దని పదే పదే విజ్ఞప్తి చేశారు.