HURRY UP: ఇంటర్ విద్యార్హతతో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు…

-

ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల నిరుద్యోగులు ఉద్యోగాల నోటిఫికేషన్ ల కోసం పడిగాపులు కాస్తున్నారు. కాగా తాజాగా కేంద్ర ప్రభుత్వం నుండి కొత్త నోటిఫికేషన్ విడుదలయింది. స్టాఫ్ సెలక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఎంపికలు జరగనున్నాయి. కంబైన్డ్ హయ్యర్ సెకండరీ లెవెల్ పరీక్షల కోసం ఈ నోటిఫికేషన్ విడుదల అయింది. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 1600 కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేయనుంది. ఈ ఉద్యోగాలకు ఇంటర్ పాస్ అయిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునే చివరి తేదీని జూన్ 8 గా SSC నిర్ణయించింది. ఇక అప్లై చేసుకున్న తర్వాత అందులో ఏమయినా తప్పులు ఉంటే సరిదిద్దుకునే అవకాశాన్ని జూన్ 14 మరియు 15వ తేదీల్లో కల్పించింది.

కాగా ఈ ఉద్యోగాలకు వయసు కూడా ఆగస్ట్ 1వ తేదీకి 18 నుండి 27 సంవత్సరాల మధ్య ఉండాలి. ఇక ఈ పరీక్షకు ఆగష్టు 2 నుండి 23 వరకు జరిపించనున్నారు. మరిన్ని వివరాల కోసం అపీషియల్ వెబ్ సైట్ : ssc.nic.in ను సంప్రదించగలరు.

Read more RELATED
Recommended to you

Latest news