పెళ్ళైన మగవాళ్ళు ఈ వార్త విన్నారా..! తెలియక పోతే తెలుసుకోండి. అలాంటి ఇలాంటి వార్త కాదు. పెళ్ళైన మగాళ్ళకు ఏకంగా ఐదేళ్లు మగవాళ్ళ ఆయుష్ ను పెంచేసే వార్త. అదేంటి పెళ్లయ్యాక పురుషుడి ఆయుస్సు పెళ్ళాం తో వెగలేక రోజు రోజుకు తగ్గుతుంది కానీ పెరగడం ఏంటి విడ్డూరం అనుకుంటున్నారా..! ఏవో పరిశోధనల్లో ఇది తెలిసింది అంటూ సోషల్ మీడియా లో ఈ వార్త బాగా వైరల్ అవుతుంది.
సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఎన్నో వింతలు జనాలు చూస్తున్నారు. తాజాగా దీనికి సంబంధించిన ఒక పోస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది. అదేంటి, ఎలాగా అనేది ఇప్పుడు తెలుసుకుందాం. రోజూ ఉదయాన్నే లేవగానే ముందు మీరు చెయ్యాల్సిన పని మీ భార్యను ముద్దు పెట్టుకోవాలట. అలా లేచీ లేవగానే భార్యను ముద్దు పెట్టుకునే భర్తకు ఏకంగా ఐదేళ్లు ఆయుష్షు పెరగుతుందని పరిశోధనల్లో తేలినట్లు పరిశోధకులు గుర్తించారు.
ఇంతకీ పరిశోధన చేసే వాళ్లకు భర్తల మీద చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చినట్లు…? బహుశా పెళ్ళైన ఆడవాళ్ళు, పురుషుల కంటే ఎక్కువగా ఆరోగ్యం ఉండటం చూసి ఏదో ఒకటి చేసి భర్తలకు సహకరిద్దాం అనుకుని ఉంటారు పాపం పరిశోధకులు. అయితే ఇక్కడే ఒక సమస్య అర్దం కావట్లేదు పాపం భర్తలకు, అదేంటంటే ఇంకో ఐదేళ్లు ఆయుష్షు పెరిగి భార్యతో వేగడం అనేది అదృష్టం అనుకోవాలా..! ఇంకేదైనా అనుకోవాలో అర్దం కాక సతమతం అవుతున్నారు.