నా భార్య నన్ను కొడుతోంది. నాకు విడాకులు ఇవ్వకపోతే చచ్చిపోతా అని ఒక వ్యక్తి చెరువులో కి దిగాడు. ఇక వివరాల లోకి వెళితే.. హైదరాబాద్ లో ఇది చోటు చేసుకుంది. నగేశ్ అనే వ్యక్తి కొంపల్లి జయభేరి పార్క్ చెరువు లోకి దిగాడు. తరవాత నా భార్య నన్ను కొడుతోందని ఆందోళన చేసాడు. నా పిల్లల దగ్గరకు నన్ను రానివ్వడం లేదు, నాకు విడాకులు ఇప్పించండి అని ఆందోళన చేసాడు. ఒకవేళ అలా జరగలేదంటే చచ్చిపోతా అంటూ అతడు ఆందోళన చేశాడు.
నా భార్య నన్ను కొడుతోంది.. నాకు విడాకులు ఇప్పించకుంటే సచ్చిపోతా అంటూ చెరువులో దిగిన వ్యక్తి
హైదరాబాద్ – నగేశ్ అనే వ్యక్తి కొంపల్లి జయభేరి పార్క్ చెరువులోకి దిగి నా భార్య నన్ను కొడుతోంది.. నా పిల్లల దగ్గరకు నన్ను రానివ్వడం లేదు, నాకు విడాకులు ఇప్పించండి, లేదంటే సచ్చిపోతా అంటూ… pic.twitter.com/izaSB5y42x
— Telugu Scribe (@TeluguScribe) April 18, 2024
ప్రస్తుతం ఈ సంఘటనకి సంబంధించి వీడియో వైరల్ అవుతోంది. ఈ భార్యాభర్తల సంఘం అని అలాంటిదే ఏదైనా ప్లాన్ చేయొచ్చు కదా అంటూ యూజర్లు కామెంట్లు చూస్తున్నారు. నువ్వు నిజంగా ఇన్స్పిరేషన్ అన్నా అంటూ ఇంకొక నెటిజన్ కామెంట్ చేశారు ప్రస్తుతం ఈ భర్త ఆందోళన చెందుతున్న వీడియో నెట్టింట వైరల్ గా మారింది.