వయస్సు మీద పడ్డా చంద్రబాబు కి బుద్ధి రాలేదు: పేర్ని నాని

-

మచిలీపట్నం ప్రజాబలం సభలో పేర్ని నాని మీద టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేశారు. పేర్ని నాని బూతులు నాని అని చంద్రబాబు కామెంట్స్ చేశారు దానిపై గురువారం స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. పేర్ని నాని మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు మీద మండిపడ్డారు వయసు మీద పడ్డా బుద్ధి మాత్రం మారలేదని అన్నారు.

తను ఎప్పుడూ పవన్ కళ్యాణ్ చంద్రబాబు మీద బూతులు మాట్లాడలేదని అన్నారు చంద్రబాబు చెప్పేవన్నీ కూడా అబద్దాలే అని అన్నారు. చంద్రబాబు రాజకీయాలు అసత్యాలు మీద మాత్రమే విమర్శలు చేశానని వ్యక్తిగతంగా బూతు వ్యాఖ్యలు చేయలేదని చెప్పారు. బొంకు మాటలు ఇచ్చిన హామీల మీద వీడియో క్లిప్పింగ్స్ చంద్రబాబు చూసుకోవచ్చని పేర్ని నాని అన్నారు జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బందరు రూపురేఖలు మారిపోయాయి అని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news