హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారం ముగియడంతో ఎన్నికల అధికారులు పోలింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ మేరకు హుజురాబాద్ ఉప ఎన్నిక మార్గదర్శకాలు విడుదల చేశారు అధికారులు. దీని ప్రకారం 30 న ఉదయం 7 గంటల నుండి రాత్రి 7 గంటల వరకు పోలింగ్ సమయం ఉండనుంది.
కోవిడ్ సోకిన వారు సైతం సాయంత్రం పిపిఈ కిట్లు ధరించి ఓటు హక్కు వినియోగించేలా ఏర్పాట్లు చేశారు. 28 న సాయంత్రం 7 గంటల నుండీ 30 తేదీ వరకు డ్రై డే ప్రకటించారు. అధికారులు 97% ఓటర్ల కు ఓటరు స్లిప్పుల పంపిణి చేశారు.
3865 మందితో పోలిస్ బందోబస్తు, 20 కంపెనీ ల కేంద్ర బలగాలు హుజురాబాద్ లో మోహరించాయి. 306 పోలింగ్ కేంద్రాల వద్ద భారీగా పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎన్నికలు ముగిసే వరకు నియోజకవర్గం లో 144 సెక్షన్ అమలు లో ఉండనుంది.
306 పోలింగ్ కేంద్రం లో 612 ఈవీఎం బ్యాలెట్ యూనిట్ల ఏర్పాట్లు చేయనున్నారు. అందుబాటులో అదనంగా 279 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేశారు అధికారులు. 77 సమస్యాత్మక ప్రాంతాలు,15 అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో భద్రత కట్టుదిట్టం చేశారు అధికారులు. వెబ్ కాస్టింగ్ తో పోలింగ్ కేంద్రంలో రికార్డ్ చేయనున్నారు అధికారులు. ఎన్నికల పరిశీలకులు,స్పెషల్ స్క్వాడ్స్ నిరంతరం పర్యవేక్షణ చేయనున్నారు. కాగా నిన్న రాత్రి తో హుజురాబాద్ లో ప్రచారానికి తెరపడిన సంగతి తెలిసిందే.