ఓటుకు రూ. 5 వేలు : గెల్లు శ్రీనివాస్ భార్య వ్యాఖ్యలు వైరల్ !

హుజురాబాద్‌ నియోజక వర్గ ఉప ఎన్నికల ప్రచారం చాలా రసవత్తరంగా సాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ఈ నియోజకవర్గ ఉప ఎన్నికల షెడ్యూల్ ఖరారు కాగా.. అన్ని పార్టీలు ప్రచారంపై ఫోకస్ చేశాయి. ఇక అటు అధికార పార్టీ టిఆర్ఎస్ , కాంగ్రెస్‌ మరియు భారతీయ జనతా పార్టీలు తమ అభ్యర్థులను ప్రకటించే సి ప్రచారంలో దూసుకుపోతున్నాయి.

gellu srinivas yadav

ఈ నేపథ్యం లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ భార్య చేసిన వ్యాఖ్యలు హుజురాబాద్‌ నియోజక వర్గంలో హాట్‌ టాపిక్‌ గా మారిపోయాయి. హుజురాబాద్‌ నియోజక వర్గంలోని వీణ వంక మండలం గంగారం గ్రామంలో టీఆర్ఎస్ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్ సతీమణి శ్వేత ఇవాళ ప్రచారం నిర్వహించారు.

ఓటు అభ్యర్థిస్తూ.. మనిషికి ఐదు వేలు మొన్న ఇచ్చాం కదా… దసరాకి అవే డబ్బులు వాడుకోవాలని సూచించారు గెల్లు శ్వేత. మొన్న ఇచ్చిన డబ్బులే దసరా గిఫ్ట్ అనుకొని వాడుకోవాలని ప్రజలకు సూచలను చేశారు శ్వేత. ఆ డబ్బులు వాడుకుని… కారు గుర్తుకే ఓటు వేయండి అని ప్రచారం చేశారు ఆమె. అయితే.. ఆమె చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.