తెలంగాణ హుజూర్ నగర్ నియోజకవర్గంలో ఉప ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7గంటలకు ప్రారంభమైన పోలింగ్.. 5గంటలకు క్లోజ్ అయింది. అయితే 5గంటల్లోపు క్యూ లైన్లో నిలుచున్న వారందరికీ ఓటేసే అవకాశం కల్పించారు అధికారులు. కాగా, అధికార టీఆర్ యస్ పార్టీకి.. సిట్టింగ్ స్థానం కాపాడుకొనేందుకు కాంగ్రెస్ పార్టీలు ప్రధానంగా పోటీ పడ్డాయి. అయితే పనిచేయని ఈవీఎంలను అధికారులు రీప్లేస్ చేయడంతో.. ఓటింగ్ ప్రశాంతంగా జరిగింది. చెదురుమదురు ఘటనలు మినహా.. హుజూర్ నగర్ ఉప ఎన్నిక ప్రశాంతంగా ముగిసింది.
ఇక పోలింగ్ ముగిసే సమయానికి 82.3 శాతం నమోదైనట్లు తెలుస్తోంది. డిసెంబరు ఎన్నికల్లో 85.96 శాతం నమోదయింది. తాజాగా ఈ ఉపఎన్నికలో కూడా అంతే స్ధాయిలో నమోదయ్యే అవకాశాలున్నట్టు బావిస్తున్నారు. ఇక 24వ తేదీన ఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభమవ్వనుంది.