HYD : హైడ్రాపై అసదుద్దీన్ సీరియస్..ఏమన్నారంటే?

-

హైదరాబాద్ మహానగరంలో హైడ్రా కూల్చివేతలపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు.సోమవారం నిర్వహించిన ఓ సభలో ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ సెక్రటేరియట్ కూడా ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉందని, దేశంలోని ప్రముఖుల సమాధులన్నీ ఎఫ్‌టీఎల్‌లో ఉన్నాయన్నారు. చివరికి బాపూఘాట్ కూడా ఎఫ్‌‌టీఎల్ పరిధిలోనే ఉందని, ఇవన్నీ ఎఫ్‌టీఎల్ పరిధిలో ఉన్నప్పుడు పేదల ఇళ్లు ఉంటే తప్పేంటని ప్రశ్నించారు. పేదల ఇళ్ల కూల్చివేతపై ప్రభుత్వం పునరాలోచించుకోవాలని కోరారు.2013లో కాంగ్రెస్ తెచ్చిన భూచట్టం ప్రకారం కూల్చివేతలపై సర్కార్ ముందుకెళ్లాలన్నారు.

రేవంత్ సర్కార్ కూల్చివేతలపై కాకుండా ముందు ఎన్నికల టైంలో ఇచ్చిన హామీలు నెరవేర్చడంపై దృష్టి సారించాలని హితవు పలికారు.గతంలోనూ హైడ్రాపై అసదుద్దీన్ ఓవైసీ ఇలాంటి వ్యాఖ్యలే చేశారు.జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయం, నెక్లెస్‌రోడ్‌‌తో పాటు అనేక ప్రభుత్వ భవనాలు ఎఫ్‌టీఎల్ పరిధిలోనే ఉన్నాయంటూ ఓ నెల కిందట గుర్తుచేశారు. మరి ఆ భవనాలను కూడా కూల్చుతారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

Read more RELATED
Recommended to you

Latest news