శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో ఉత్పత్తి ప్రారంభం అయింది. తెలంగాణా జెన్ కో అధికారులు రెండు యూనిట్ల ద్వారా ఉత్పత్తి ప్రారంభించారు. ఈ రెండు యూనిట్స్ కి గత నెలలో ట్రయల్ రన్ విజయవంతం అయింది. మిగిలిన 4 యూనిట్ లలో కూడా త్వరలో ట్రయల్ రన్ చేయనున్న అధికారులు వాటిని కూడా పునరుద్దరించి వాటి ద్వారా కూడా విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభించనున్నారు.
ఈ ఏడాది ఆగస్టు 20న పవర్‌హౌ్‌సలో మంటలు చెలరేగి దాదాపు 900 మెగావాట్ల జల విద్యుత్తు ఉత్పాదనకు విఘాతం ఏర్పడింది. ఒకటి, రెండవ యూనిట్లలో ప్రమాదం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని, వాటిని 20 రోజుల వ్యవధిలో పునరుద్ధరిస్తామని మంత్రులు, జెన్‌కో, ఎస్‌సీడీసీఎల్ అధికారులు అప్పుడు ప్రకటించారు. కానీ రెండు యూనిట్ లు అందుబాటులోకి రావడానికి రెండు నెలల సమయం పట్టింది.