Atum 1.0: ఈ టూ వీలర్ కి లైసెన్స్, పెట్రోల్ అవసరమే లేదు…!

-

పెట్రోల్ ధరలు విపరీతంగా పెరిపోతున్నాయి. దీనితో వాహనదారులు కూడా ఎలెక్ట్రిక్ వాహనాల వైపు మక్కువ చూపిస్తున్నారు. తాజాగా హైదరాబాద్ కి చెందిన ప్రముఖ స్టార్టప్ కంపెనీ ఆటమ్ మొబైల్ సరికొత్త ఎలక్ట్రిక్ బైక్ ను విడుదల చేసింది. పైగా లైసెన్స్, పెట్రోల్ అవసరమే లేదు. ఇక ఈ టూ వీలర్ ఫీచర్స్ ని కనుక చూస్తే.. సూపర్ టెక్నాలజీ తో దీనిని తయారు చేయడం జరిగింది.

ఈ బైక్ గంటకు గరిష్టంగా 25 కిలో మీటర్ల వేగం తో ప్రయాణిస్తుంది అని కంపెనీ చెప్పింది. దీని బరువు వచ్చేసి దీని బరువు 35 కేజీలు మాత్రమే. ఈ బైక్ 1.0 ఎలక్ట్రిక్ బైక్ 48 ఓల్డ్ 250 watt లిథియం అయాన్ బ్యాటరీ ప్యాక్ తో పని చేస్తుంది. పైగా ఇది నాలుగు గంటల్లోనే ఛార్జ్ అయి పోతుంది. ఈ బైక్ కి మరో సూపర్ ఫీచర్ ఏమిటంటే..? దీనికి డిజిటల్ డిస్ప్లే కూడా ఉంది .ఈ డిస్ప్లే లో బ్యాటరీ స్టేటస్, స్పీడ్, ఎన్ని కిలోమీటర్లు ప్రయాణించాము వంటివి చూడవచ్చు.

ఇప్పటి వరకు 400 పైగా యూనిట్లో బుక్ చేసుకున్నట్లు సమాచారం. ఈ బైక్ డెలివరీలు కూడా స్టార్ట్ అయ్యాయి. హైదరాబాద్ , న్యూ ఢిల్లీ , కోల్కతా, చెన్నై, బెంగళూరు వంటి నగరాలలో ఆటమ్ 1.0 బైక్ ను అందించనుంది. ఈ బైక్ వలన లైసెన్స్ పెట్రోల్ అవసరం లేదు పైగా చలానాలు కూడా పడవు కూడా.

 

 

Read more RELATED
Recommended to you

Latest news