పెద్ద పెద్ద నగరాల్లో దొంగతనాలు రోజు రోజుకు ఎక్కువ పెరిగిపోతున్నాయి..పోలీసుల కళ్ళు కప్పే ప్రయత్నం చేస్తున్నారు. చిన్న చిన్న పొరపాటులు దొంగలను పట్టిస్తున్నాయి.తాజాగా మరో ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ అంతరాష్ట్ర దొంగ తాళాలు వేసిన ఇంట్లో దర్జాగా దొంగతనం చేసుకుంటూ, తన సొంత రాష్ట్రం కు వెళ్ళేవాడు. అలా పోలీసులకు మస్కా కొట్టి కొన్నెల్లుగా దొంగతనం చేసేవాడు.ఇప్పుడు అలానే చేసాడు..కానీ దొరికాడు. అది కూడా బిర్యానీ తినడం వల్ల అడ్డంగా దొరికాడు.
మెహిదీపట్నంలో ప్రైవేట్ ట్రావెల్స్ పేరు పై జొమాటో ద్వారా బిర్యానీ తెప్పించుకుని, ఆ ట్రావెల్స్ నుంచి బెంగళూరుకు చేరుకునేలా ఏర్పాట్లు చేసుకునేవాడు. వీటి లావాదేవీలు మొబైల్ నంబర్ ద్వారా జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు. కాల్‌డేటా ఆధారంగా మలక్‌పేట క్రైం ఇన్‌స్పెక్టర్ నానునాయక్‌తో కూడిన క్రైం పోలీసుల బృందం బెంగళూరులో నిందితుడు సయ్యద్ ఐజాజ్ ఉన్నట్లుగా గుర్తించి పట్టుకున్నారు. అతడి నుంచి రూ.2.50లక్షలు, 85 గ్రాముల బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడికి నగరంలో జరిగిన తొమ్మిది కేసులతో సంబంధమున్నట్లుగా గుర్తించారు..అతను చేసిన దొంగతనాలు గురించి వివరాలను సేకరిస్తున్నారు.