స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన హైదరాబాద్ సీపీ… ఎన్నికలు ముఖ్యం కాదంటూ

-

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో కొంత మంది మత ఘర్షణల కోసం ప్రయత్నాలు చేస్తూ అలజడి కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. వారి సమాచారం తమ వద్ద ఉంది అని సిఎం కేసీఆర్ అన్న సంగతి తెలిసిందే. మాటలతో కవ్వింపు చర్యలకు దిగుతున్నారు అని ఆయన ఆరోపించారు. హైదరాబాద్ సహా రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.Hyderabad: CP Anjani Kumar urges citizens to observe 'Janata Curfew'

దీనిపై హైదరాబాద్ సీపీ అంజనీ కుమార్ స్పందించారు. “హైదరాబాద్‌లో ఏదో జరుగుతోందని ప్రచారం చేస్తున్నారు.. మత ఘర్షణలు సృష్టించేందుకు కుట్ర పన్నుతున్నారు అన్నారు. సోషల్ మీడియా ప్రచారాన్ని ప్రజలు నమ్మవద్దు అన్నారు. మత ఘర్షణలు, శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే పీడీ యాక్ట్ పెడతామని హెచ్చరించారు. ఎన్నికలు వస్తుంటాయి.. పోతుంటాయి అన్నారు. హైదరాబాద్‌, ప్రజలు శాశ్వతంగా ఉంటారన్నారు. హైదరాబాద్ పోలీసులు అందరూ అప్రమత్తమయ్యారు అని ఎలాంటి సంఘటనలకు అవకాశం లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news