ఒక గ్యాంగ్ రేప్ కు సంబంధించి ఇప్పటిదాకా ఏవో సంచలనాలు వస్తున్నాయి. చదువుకునే పిల్లలు ఇందులో 1 మేజర్ 5 గురు మైనర్లు ఉన్నారని వార్తలు వస్తున్నాయి. పోలీసులు సైతం ఇదే ధ్రువీకరిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి ఇంకా దర్యాప్తు సాగుతూనే ఉంది. కనుక హైద్రాబాద్ లో నమోదు అయిన గ్యాంగ్ రేప్ గురించి ఐదు నిజాలు మాట్లాడుకుందాం.
ఒకటి పొలిటికల్ జోక్యం : 16 ఏళ్ల బాలిక రేప్-నకు సంబంధించి ప్రముఖుల పిల్లల పేర్లు వెలుగులోకి రావడం. వీటిపై టీఆర్ఎస్ కానీ ఎంఐఎం కానీ స్పందించిన తీరు అత్యంత అనుమానాస్పదంగా ఉండడం. ఇది నిజంగానే సిగ్గుతో తలదించుకోవాల్సిన తరుణమే అని ఎమ్మెల్యే (దుబ్బాక) రఘునందన్ లాంటి వారు చెప్పడం ఈ ఘటనలో తొలుత వెలుగు చూసిన నిజం.
రెండు గులాబీ దండు తప్పిదం : మొదట హోం మంత్రి మనవడు వెలుగు చూడడం. డీసీపీ ఆయనకు రాత్రికి రాత్రే క్లియరెన్స్ ఇవ్వడం. నిజానికి సమస్యంతా సమగ్ర దర్యాప్తు లేకుండా ఇలాంటి స్టేట్మెంట్ ఇవ్వడం అన్నదే సిసలు తప్పు. ఇదే నిజం. వాస్తవంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న వ్యక్తుల విషయమై నిజా నిజాలు తేల్చకుండా పోలీసు ఇచ్చిన స్టెట్మెంట్ అత్యంత అనుమానాస్పదం. ఇదే నిజం. ఇదే మాట బీజేపీ పదే పదే అంటోంది.
మూడు ఎంఐఎం తప్పిదం : ఘటనలో ఓ ఎమ్మెల్యే కుమారుడు (ఎంఐఎం పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుమారుడు) పేరు రావడం. వెంటనే ఆ పార్టీ కూడా రాజకీయ ఒత్తిళ్లను పోలీసులపై తీసుకురావడం. దీనిపై బీజేపీ భగ్గు మనడం. అటుపై డీసీపీ ఈ ఆరోపణ కూడా కొట్టివేయడం..ఇవన్నీ అనుమానాలకు తావిచ్చే అంశాలే ! ఎంఐఎం జోక్యం నిజం. టీఆర్ఎస్ అతి జోక్యం ఇంకా నిజం అని బీజేపీ అంటున్నది ఇందుకే !
రియల్ హీరో రఘునందన్ : మంచో, చెడో ఉన్నంత మేరకు వివరాలు చెప్పేందుకు, ఆధారాలను వెలుగులోకి తెచ్చేందుకు ఎమ్మెల్యే రఘునందన్ ప్రయత్నించడం. ఇప్పుడు ఆధారాలు మీడియాకు విడుదల చేయడంపై పోలీసు కేసు నమోదు అయినా కూడా చర్యకు తప్పక ప్రతి చర్య ఉంటుందని, తాను చట్టాన్ని తప్పక గౌరవిస్తానని చెప్పడం ఈ కథలో సిసలు నిజం. ఇదే వాస్తవం కూడా ! ఆయనకు ఆధారాలు ఎలా వచ్చేయి అనే కన్నా అసలు నిజాలు వెలుగులోకి తీసుకుని రావడంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారు. ఎట్టకేలకు సీపీ సీవీ ఆనంద్ కొన్ని విషయాలు వెల్లడిచేసినా ఇవన్నీ ఎప్పుడో ఆ బీజేపీ ఎమ్మెల్యే మీడియా ఎదుట చెప్పేశారు. కనుక సీపీ కొత్తగా తేల్చిందేమీ లేదు అన్నది నిజం. రఘునందన్ చెప్పిన మాటలు, వీటిపై ఆయన చేస్తున్న పోరాటం ఇవన్నీ బాగున్నాయి. ఇవే నిజాలు. రాజకీయంగా అనూహ్యంగా ఎదగాలన్న యావ లేని గుణం ఒకటి ఆయనలో ఉంది అన్నది కూడా నిజం.
ఆఖరుగా ఎన్.ఎస్.యు.ఐ : కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగంగా నేషనల్ స్టూడెంట్ యూనియన్ ఆఫ్ ఇండియా సింపుల్ గా ఎన్.ఎస్.యు.ఐ. కూడా కొంత చొరవ తీసుకుని శంషాబాద్ లో 3 పబ్బులపై దాడులు చేయడం, నిర్వాహకులని ప్రశ్నించడం నిజం. ఒకవేళ ఈ ఘటనలో విద్యార్థి సంఘ నాయకులు పోలీసుల నుంచి తీవ్ర అవమానాలు ఎదుర్కొన్నా కూడా మిగతా విద్యార్థి సంఘాల కన్నా తక్షణ కార్యాచరణలో ఉన్న కాంగ్రెస్ విద్యార్థి విభాగం ఎన్.ఎస్.యు.ఐ ప్రతిఘటన నిజం.