జొన్న రొట్టెలు ఎవరు తింటే లాభము..!!

-

పూర్వపు రోజులలో ఎక్కువగా రాగి రొట్టెలు, జొన్న రొట్టెలు వంటివి తింటూ ఉండే వారు మన పూర్వీకులు. అందుచేతనే వారు ఎంతో బలంగా, ఎటువంటి వ్యాధులు రాకుండా ఉండే వారు. కానీ ప్రస్తుతం దేశంలో ఎంతోమంది ఫాస్ట్ ఫుడ్స్ నే ఎక్కువగా తింటూ ఉండడం వల్ల అధిక బరువు పెరిగిపోతున్నారు. ఇక దీంతో మరికొంతమందికి షుగర్ వంటి రోగాలు వస్తున్నాయి. అయితే ఇలాంటి రోగాల నుంచి బయట పడాలి అంటే కచ్చితంగా జొన్న రొట్టెలు తినడం చాలా ముఖ్యము. అయితే పలు ప్రాంతాలలో వీటిని పలు రకాలుగా పిలుస్తూ ఉంటారు. అయితే జొన్న రొట్టెలను ఎవరు తినాలో ఇప్పుడు చూద్దాం.

పిండితో చేసేటువంటి ఏ వంటకాలు అయిన సులభంగా మనకి అరుగుతాయి. దీనివల్ల బరువు తగ్గాలనుకునే వారు వీటిని సులువుగా తినవచ్చు. ఇందులో గ్లూటైన్ ఉండదు కాబట్టి ఫైబర్ కూడా ఎక్కువగా ఉండదు కాబట్టి షుగర్ లెవల్స్ కంట్రోల్లో ఉంటాయి. బలహీనంగా ఉండే వారు వీటిని తినడం చాలా మంచిది ఎందుచేత అంటే ఇందులో మైక్రో న్యూట్రియన్స్ ఎక్కువగా ఉండడం వల్ల శరీరం దృఢంగా మారుతుంది. ఎప్పుడు నీరసంగా ఉండే వారు వీటిని తినడం వల్ల ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి దీంతోపాటు బ్లడ్ సర్క్యులేషన్ కూడా బాగా పెరుగుతోంది.

వాస్తవానికి మన శరీరంలో చెడు కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్న ,మంచి కొలెస్ట్రాల్ తక్కువగా ఉన్నప్పుడే గుండె ఆరోగ్యంగా పనిచేస్తుంది.. అవసరానికి మించి ఏదైనా ఉన్నాయి అంటే ఆ వెంటనే గుండె జబ్బుల బారిన పడే అవకాశం ఉంటుంది. అందుచేతనే జొన్న రొట్టెలు తినడం వల్ల ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండడం వల్ల గుండె జబ్బులు రాకుండా ఉంటుంది. జొన్న రొట్టెలను ఎటువంటి వారు అయినా తినవచ్చు.. వీటిని వారంలో కనీసం మూడు రోజులపాటు తినవచ్చు. ముఖ్యంగా ఆకు కూరలు లో వీటిని కలుపుకుని తినడం చాలా మంచిది.

Read more RELATED
Recommended to you

Latest news