హైదరాబాద్ నగరంలో పలు చోట్ల భారీ శబ్దాలు జనాలను భయబ్రాంతులకు గురి చేశాయన్న సంగతి తెలిసిందే. బోరబండ, రెహమత్ నగర్, అల్లాపూర్ ప్రాంతాల్లో వింత వింత శబ్దాలు రావడంతో జనం వణికి పోయారు. భూకంపం వచ్చిందేమో అనుకుని బయటకు పరుగులు తీశారు. భయంతో రాత్రి అందరూ ఇంటి బయటనే ఉండి పోయారు. మూడేళ్ల క్రితం కూడా ఇలాంటి ఘటన జరిగిందట. పనులకు వెళ్లే వారితో సందడిగా కనిపించే బోరబండ.. చడీచప్పుడు లేనట్టుగా మారింది. రాత్రంతా జనాలు ఇళ్ల బయటే ఉన్నారు.
రాత్రి నుంచి తిండి కూడా లేకుండా వాళ్ళు బయటే ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఉన్నారు. దొమలతో కుట్టించుకుంటూ ఉన్నారు. సర్లే కదా అని వాళ్ళ బాధలను చూపడానికి మీడియా వాళ్ళు మైకులు పట్టుకు వెళ్తే ఈ శబ్దాలు వచ్చి… కార్తీకదీపం సీరియల్ కూడా చూడలేదు సార్ అని ఒకావిడ చెప్పడం అక్కడ నవ్వులు పూయించింది. జనం సీరియళ్ళకి ఇంత అడిక్ట్ అయ్యారా ? అని అనుకుంటున్నారు. ఇక ఇక్కడ భూకంపం వచ్చినట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు, 1.4 తీవ్రతతో భూకంపం వచ్చినట్లు గుర్తించామని రాత్రి 8 గంటల 45 నిమిషాలకు ప్రకంపనల వచ్చాయని చెబుతున్నారు. అలానే తిరిగి రాత్రి 11:24 భారీ శబ్దాలతో భూప్రకంపనలు వచ్చాయని ధ్రువీకరించారు.