హైద‌రాబాద్‌లో మెట్రో సేవ‌లు ప్రారంభం

-

క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో గ‌త మార్చి 22న నిలిచిపోయిన హైద‌రాబాద్ మెట్రో రైలు సేవ‌లు తిరిగి సోమ‌వారం నుంచి ప్రారంభ‌మ‌య్యాయి. 168రోజుల త‌ర్వాత ఈ రోజు ఉద‌యం 7గంట‌ల‌కు మెట్రో రైళ్లు ప్రారంభ‌య్యాయి. ఉద‌యం 7గంట‌ల నుంచి మ‌ధ్యాహ్నం 12గంట‌ల వ‌ర‌కు, ఆ త‌ర్వాత సాయంత్రం 4గంట‌ల నుంచి రాత్రి 9గంట‌ల‌కు వ‌ర‌కు మెట్రో సేవలు అందుబాటులో ఉంటాయి.

ఈరోజు కారిడార్ 1 మియాపూర్ నుంచి ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు సేవ‌లు ప్రారంభించారు. అయితే.. క‌రోనా వైర‌స్ నేప‌థ్యంలో మెట్రో అధికారులు త‌గు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు. ఎప్ప‌టిక‌ప్పుడు రైళ్ల‌ను శానిటైజ్ చేస్తున్నారు. లాక్‌డౌన్ కార‌ణంగా నిలిచిపోయిన మెట్రోరైళ్లు ఎట్ట‌కేల‌కు ప్రారంభం కావ‌డంతో ప్ర‌యాణికులు ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news