ఇండియాకు మరియు పాకిస్తాన్ కు మధ్యన చాలా కాలంగా వివరించలేని వైరం ఉన్న సంగతి తెలిసిందే. దీనితో పాకిస్తాన్ నుండి అనుమానిత వ్యక్తి ఎవరైనా ఇండియాలోకి ప్రవేశించినా ప్రభుత్వం చాలా సీరియస్ గా తీసుకుని విచారించి కఠినమైన నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ రోజు పాకిస్తాన్ కు చెందిన ఫయాజ్ అనే వ్యక్తి అక్రామంగా ఇండియాలోకి రాగా .. పోలీసులు అరెస్ట్ చేశారు. పూర్తి వివరాల ప్రకారం ఫయాజ్ పాకిస్తాన్ కు చెందినవాడు కాగా .. ఇతను దుబాయ్ లో ఉద్యోగం చేస్తూ అక్కడే పనిచేస్తున్న హైదరాబద్ యువతిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇప్పుడు సదరు యువతీ గర్భవతి కావడంతో హైద్రాబాద్ కి వచ్చింది, ఆమెను చూడడానికి ఒక భర్తగా దుబాయ్ నుండి హైదరాబాద్ కు రావడంతో అక్కడి పోలీసులు పట్టుకున్నారు.
మరి అన్ని వైపులా సక్రమంగా విచారణ చేసి ఇతనితో ఏమీ ఇబ్బందులు లేవని తేలితేనే అతన్ని విడుదల చేసే అవకాశం ఉంది. మరి ఈ విషయంలో ఏమి జరగనుందో వేచి చూడాల్సి ఉంది.