బాలయ్య “భగవంత్ కేసరి” నుండి క్రేజీ అప్డేట్ …!

-

టాలీవుడ్ లో ఉన్న అగ్రహీరోలు అంతా వరుస సినిమాలు చేస్తూ కుర్ర హీరోలకు సెగలు పుట్టిస్తున్నారు. ముఖ్యంగా చిరంజీవి మరియు బాలకృష్ణలు అలుపెరగకుండా వరుసగా సినిమాలు చేస్తూ వస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ఈ మధ్యనే వీరసింహారెడ్డి తో బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభించగా, తాజగా అనిల్ రావిపూడి డైరెక్షన్ లో భగవంత్ కేసరి అన్న భిన్నమైన టైటిల్ తో ప్రేక్షకులను అలరించడానికి ముస్తాబవుతున్నాడు. ఇక తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్డేట్ ను చిత్ర బృందం కాసేపటి క్రితమే తెలియచేసింది.. తెలుస్తున్న సమాచారం ప్రకారం ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను “గణేష్ ఆంథం” ఫుల్ లిరికల్ సాంగ్ ను రేపు సాయంత్రం 5 .06 గంటలకు చిత్ర బృందం విడుదల చేయనుంది.

నిన్ననే ఈ సాంగ్ యొక్క ప్రోమో ను విడుదల చేయగా .. అందులో బాలయ్య డైలాగ్స్ తో మరియు శ్రీలీల లుక్స్ తో ఆకట్టుకున్నారు. ఇక ఈ సినిమాను అనిల్ రావిపూడి అక్టోబర్ 19న విడుదల చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news