తెలంగాణ కాంగ్రెస్ “పీఈసి” మీటింగ్ వాయిదా !

-

తెలంగాణాలో అధికారంలో ఉన్న BRS ను ఓడించడానికి ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీలు కాచుకు కూర్చున్నాయి. ఈ సారి జరగనున్న ఎన్నికలో కేసీఆర్ ఏ మాత్రం అతి విశ్వాసంతో ఉన్నా అసలుకే మోసం వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని అన్ని పార్త్యులు అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో పడ్డారు. అందులో భాగంగా కాంగ్రెస్ కూడా తమ అభ్యర్థులను ఎంపిక చేయడానికి సెప్టెంబర్ 2వ తేదీన పీఈసి సమావేశం నిర్వహించుకోవాలని షెడ్యూల్ చేసుకున్నారు. కానీ అదే రోజున దివంగత నేత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి వర్ధంతి ఉండడంతో ఈ సమావేశాన్ని కాంగ్రెస్ వాయిదా వేసుకుంది. ఈ మీటింగ్ ను సెప్టెంబర్ 3వ తేదీ న జరగడానికి ముహూర్తం పెట్టారు. ఈ సమావేశం అనంతరం పక్క రోజున టీపీసీసీ స్క్రీనింగ్ కమిటీ భేటీ జరగనుంది.

ఇక కాంగ్రెస్ లో ఎంతమంది ఆశావహులకు సీట్లు దక్కుతాయో ? ఎంతమందికి నిరాశ మిగలనుందో తెలియాలంటే పీఈసి మీటింగ్ అయ్యే వరకు వెయిట్ చేయాల్సిందే.

Read more RELATED
Recommended to you

Latest news