చైన్ స్నాచెర్లు కోసం హైదరాబాద్‌ పోలీసుల గాలింపు..వెలుగులోకి షాకింగ్‌ నిజాలు

-

చైన్ స్నాచెర్లు కోసం హైదరాబాద్‌ పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నాకాబంది నిర్వహిస్తున్నారు పోలీస్ అధికారులు. చైన్ స్నాచర్ల ఫోటోలతో రోడ్లపై తనిఖి లు చేపడుతున్న పోలీసులు… ఫోటోలను వ్యక్తులు గుర్తించినట్లయితే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు.


West zone లిమిట్స్ లో మొత్తం 13 పోలీస్ స్టేషన్స్ లో తనిఖీ లు చేపట్టారు. ఉదయం 5 గంటల నుండి తనిఖీ లు మొదలు అయ్యాయి. ఇప్పటికే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లిమిట్స్ లో 20 వాహనాలు డిటైన్ అయ్యాయి. ఇప్పటి వరకు 300 వాహనాలు పైగా చెకింగ్ చేశారు పోలీసులు. ఈ నేపథ్యంలోనే, చెకింగ్స్ లో మైనర్లు పట్టుపడుతున్నారు. నెంబర్ ప్లేట్స్,లైసెన్స్ లేని బైక్ నడుపుతూన్నారు మైనర్లు. దీంతో మైనర్ల ను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వెళ్లి పేరెంట్స్ సమక్షం లో కౌన్సిలింగ్ ఇవ్వనున్నారు పోలీసులు.

Read more RELATED
Recommended to you

Latest news