హైదరాబాద్ లో స్పా సెలూన్ పేరుతో వ్యభిచారం..23మంది అరెస్ట్..!

నగరంలో స్పా ల మాటున వ్యభిచార దందాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అనేక స్పా ల పేరుతో వ్యభిచార దందా చేస్తున్న ముఠాలను పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కాగా తాజాగా మరోసారి నగరంలో అలాంటి ఘటనే చోటు చేసుకుంది. నగరంలోని మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న వ్యభిచార గృహం పై మాదాపూర్ ఎస్ ఓ టీ పోలీసులు దాడి చేశారు.

హవెన్ స్పా బ్యూటీ ఫ్యామిలీ సెలూన్ ముసుగు లో వ్యభిచార కేంద్రం ను నిర్వహిస్తున్నట్టు పోలీసులు పక్కా సమాచారం తో దాడి చేశారు. అనంతరం ప్రధాన నిందితుడి తో పాటు ఇద్దరు సెలూన్ మ్యానేజర్ లను అరెస్ట్ చేశారు. అలాగే 10 విటులు ..మరియు 10 మంది యువతులు మొత్తం 23 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుండి 73వేల రూపాయల నగదు, 28 సెల్ ఫోన్లు, ఒక క్రెడిట్ కార్డు, 4లక్షల రూపాయలు ఉన్న బ్యాంక్ ఖాతాను పోలీసులు సీజ్ చేశారు.