హైదరాబాద్‌ లో పాస్టర్ దారుణాలు.. మూడు పెళ్లిళ్లు చేసుకుని మరీ !

హైదరాబాద్‌ లో మరో ఘరానా మోసం బయట పడింది. హైదరాబాద్ లోని ఉప్పల్ లో మూడు పెళ్లిళ్లు చేసుకొని మోసం చేసిన ఓ కీచక పాస్టర్ అరెస్ట్ అయ్యాడు. ఈ కేసు వివరాల్లోకి వెళితే… ఉప్పల్ లోని గాస్పల్ చర్చికు పాస్టర్ గా ఉన్న జోసఫ్ అలియాస్ సాధు.. ప్రముఖ టీవీ ఛానల్లో మత ప్రభోధకుడు గా పని చేస్తూ అమాయక ఆడపిల్లను టార్గెట్ చేశాడు.

చర్చికి వచ్చే అమ్మాయిలను లొంగ దీసుకొని మోసం చేస్తున్నాడు పాస్టర్ జోసఫ్. అయితే.. ఇందులో భాగంగా మూడు అమ్మాయిలను మోసం చేసి మరీ.. మూడు పెళ్లిళ్లు చేసుకున్నాడు. అయితే.. ఈ విషయం బయట పడింది. దీంతో పాస్టర్ ఆగడాల పై మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు ఎమ్మార్పీఎస్‌ నాయకులు. వారితో పాటు లైంగిక దాడి చేసి, బెదిరింపులకు దిగుతున్నాడని ముగ్గురు అమ్మాయిలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలోనే పాస్టర్ ను పోలీసులు అరెస్ట్‌ చేసి… విచారణ చేస్తున్నారు.