ఆ హైదరాబాద్ వైద్యునికి విశిష్ట గుర్తింపు…!

-

అమెరికన్‌ గ్యాస్ట్రో ఎంటరాలాజికల్‌ అసోసియేషన్‌ ప్రకటించిన ‘విశిష్ట విద్యావేత్త’ అవార్డుకు ఎంపికయ్యారు Aig Hospitals చైర్మన్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి గారు. నాగేశ్వర్‌రెడ్డి గారు ఈ అవార్డు అందుకున్న తొలి భారతీయుడు.వివరాల్లోకి వెళ్తే…

ఏషియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ ఆస్పత్రి చైర్మన్ డాక్టర్ నాగేశ్వర రెడ్డి గారు ప్రతిష్టాత్మక అమెరికన్ గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ అసోసియేషన్ విశిష్ట విద్యావేత్త అవార్డుకు ఎంపికయ్యారు.ఈ అవార్డ్ ని డాక్టర్ నాగేశ్వర రెడ్డికి అందించనున్నారు. అమెరికా లోని కాలిఫోర్నియాలో మే 21 నుంచి 24వ తేదీల మధ్య డైజెస్టివ్ డిసీజ్ వీక్ కాన్ఫరెన్స్ జరగనుంది.

అందులో ఈ అవార్డును ఇవ్వనున్నారు.గ్యాస్ట్రో ఎంట్రాలజీ హెపటోలోజి విభాగాల్లో అత్యుత్తమ వైద్య సహకారం అందిస్తూ విజయాలను సాధించే శాస్త్రవేత్తలు మరియు వైద్యుల్ని గుర్తించి ప్రతి ఏటా కూడా అవార్డులు ఇస్తారు.ఈ వేడుక‌కు ప్రపంచ వ్యాప్తంగా 16 వేల మందికి పైగా సభ్యులు పాల్గొంటారు.భారత్ లో ఈ సంస్థ అవార్డు అందుకోనున్న తొలి వైద్యుడు డాక్టర్ నాగేశ్వర రెడ్డి కావడం విశేషం. ప్రపంచ వ్యాప్తంగా ఉన్న పేదలకు ఈయన అందిస్తున్న సేవలకు ఈ అవార్డు దక్కింది. ఈ సంద‌ర్భంగా వైద్య ఆరోగ్య శాఖ మంత్రి (తెలంగాణ‌) హ‌రీశ్ రావు ఆయ‌న‌కు శుభాకాంక్ష‌లు తెలిపారు.సోష‌ల్ మీడియా ద్వారా ఆయ‌న సేవ‌ల‌ను కీర్తించారు.

Read more RELATED
Recommended to you

Latest news