వైసీపీపై నమ్మకం పోయింది..ఏపీకి పెద్ద దిక్కు అవసరం : పురంధేశ్వరి

-

వైసీపీపై నమ్మకం పోయింది..ఏపీకి మంచి దిక్కు అవసరం అని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి పురంధేశ్వరి అన్నారు. విశాఖలో కేంద్ర ప్రముఖుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఉత్తర ప్రదేశ్ ఎన్నికల్లో బీజేపీ విజయం కార్యకర్తల సమిష్టికృషి అని… కార్యకర్తలను విశ్వశించే పార్టీ బీజేపీ ఒక్కటేనని చెప్పారు.

నాలుగు రాష్ట్రాల్లో విజయం స్ఫూర్తితో ఇక్కడ కేడర్,లీడర్లు విస్తృతంగా ప్రజల్లోకి వెళ్ళాలని.. రాష్ట్రంలో ప్రభుత్వం వికాశం వైపు కాకుండా వ్యక్తిగత స్వలాభం ప్రధానంగా వ్యవహరిస్తోందని పేర్కొన్నారు. రాష్ట్రంలో అధికార పార్టీపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లి౦దని.. రాష్ట్ర ప్రభుత్వంకి అప్పు పై ఉన్న ద్యాస అభివృద్ధిపై లేదని వెల్లడించారు.

అధ్వాన్న స్తితిలో రాష్ట్రం ఉందని.. అ౦ది౦చాల్సిన స్థాయిలో కేంద్రం రాష్ట్రానికి నిధులు అ౦ది౦చట౦ లేదన్న అపవాధు వి౦టున్నామని చెప్పారు. కేంద్రం నిధులు ఆపేస్తే ఏపీలో అభివృద్ధి సాధ్యమా…? రాష్ట్రంలోని అభివృద్ధి పనులలో కేంద్రం ఇచ్చే నిధులుతప్ప రాష్ట్ర వాటా సున్నా అన్నారు. గుప్పెడు మట్టికూడా రోడ్డుపై వేసే పరిస్థితి లేదని.. కేంద్రం ఇచ్చిన 70వేల కోట్ల నిధులను డైవర్ట్ చేసారని దగ్గుబాటి పురంధేశ్వరి ఫైర్‌ అయ్యారు…

Read more RELATED
Recommended to you

Latest news