ఆ స్టార్ హీరోకి రూ.5 కోట్ల అదనపు బిజినెస్ అందించిన హైపర్ ఆది..!

-

సాధారణంగా సినిమాలో ఉన్న ఎలిమెంట్స్ కారణంగా ఆ సినిమా బిజినెస్ జరుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు.. ఎన్నో రకాలుగా తెలుగు సినిమా మరియు ఇతర భాషల సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి ప్రయత్నాలు చేస్తూనే ఉంటాయి. ముఖ్యంగా కొన్ని సినిమాలలో కొందరు కమెడియన్స్ నటిస్తే.. ఎక్కువ బిజినెస్ జరగడం మనం చూస్తూనే ఉంటాం. కొన్ని సినిమాలలో ఐటెం సాంగ్స్ పెడితే ఎక్కువ బిజినెస్ జరగడం మనం చూస్తూనే ఉంటాము .. కానీ ధనుష్ నటించిన సార్ సినిమాలో హైపర్ ఆది ఉండడం వల్లే తెలుగులో మంచి మార్కెట్ ఏర్పడింది.

అంతేకాకుండా ధనుష్ సినిమా గతంలో చేసిన బిజినెస్ కంటే ఈసారి పది కోట్ల రూపాయలు అదనంగా బిజినెస్ చేసినట్లు సమాచారం. తెలుగు దర్శకుడు, తెలుగు నిర్మాత అవడం వల్ల రూ.5 కోట్లు బిజినెస్ చేసి ఉండవచ్చు. మరో రూ.5 కోట్లు మాత్రం కచ్చితంగా హైపర్ ఆది వల్లే వచ్చాయి అంటూ సినీ విశ్లేషకులు తమ అభిప్రాలను వ్యక్తం చేస్తున్నారు. బుల్లితెర కార్యక్రమం జబర్దస్త్ ద్వారా మంచి పాపులారిటీని సొంతం చేసుకున్న హైపర్ ఆది ఇప్పటికీ కూడా అదే జోష్ తో ముందుకు సాగిపోతున్నాడు.. ఒకవైపు బుల్లితెరపై సందడి చేస్తూనే మరొకవైపు వెండితెరపై కూడా అలరించే ప్రయత్నాలు చేస్తున్నాడు.

తాజాగా సార్ సినిమా ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా హైదరాబాదులో నిర్వహించిన కార్యక్రమాలకు హైపర్ ఆది హాజరయ్యారు. ఆయన క్రేజ్ చూసి ధనుష్ కూడా ఆశ్చర్యపోయాడు. సినిమాల్లో ఎక్కువ నటించకుండా ఇంత క్రేజ్ ఏంటో అంటూ కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసారు. మొత్తానికి హైపర్ ఆది వల్ల ధనుష్ కి కలిసొచ్చిందని చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news