విమర్శలకు భయపడేవాడిని కాదు : టీటీడీ చైర్మన్ భూమన 

-

విమర్శలకు తాను భయపడేవాడిని కాదని టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి పేర్కొన్నారు. తనపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై స్పందించారు. తాను విమర్శలకు అస్సలు భయపడనని.. హిందూ ధర్మం కోసం పోరాడుతున్నానని తెలిపారు. తాను 17 ఏళ్ల క్రితమే టీటీడీ చైర్మన్ అయిన వ్యక్తిని అని చెప్పారు. ఆ దేవుడి దయతో మతాంతీకరణలు ఆపడానికి 30వేల మందికి కళ్యాణమస్తు ద్వారా సామూహిక వివాహాలు చేయించినట్టు తెలిపారు. ఆలోచన తనదేనని చెప్పారు.

కొండమీదకు నడిచివెళ్లిన వారికి దివ్య దర్శనం కల్పించాలని టోకెన్ సిస్టమ్ ప్రారంభించింది తానేనని చెప్పారు. తిరుమల ఆలయ నాలుగు మాడ వీధుల్లో చెప్పులు వేసుకొని తిరగకూడదనే నిర్ణయం తీసుకుంది. తానేనని చెప్పారు. అన్నమయ్య 600 వర్థంతి ఉత్సవాలు చేసిందికూడా తానేనని తెలిపారు. దళిత వాడలకు శ్రీవేంకటేశ్వర స్వామిని తీసుకువెళ్లి కళ్యాణం చేయించింది తానేనన్నారు. దళితవాడలకు శ్రీవేంకటేశ్వర స్వామిని తీసుకుని వెళ్లి కళ్యాణంచేయించింది కూడా తానేనని చెప్పారు. తనపై నాస్తికుడని.. క్రిస్టియన్ అని ముద్ర వేస్తున్నారని.. అలాంటి వారికి ఇతే తన సమాధానం అని చెప్పారు. ఆరోపణలకు భయపడి మంచి పనులు చేయడం ఆపేవాడిని కాదని తెలిపారు. తాను పోరాట నుంచి పైకి వచ్చానని.. ఇలాంటి వాటికి అస్సలు భయపడనని స్పష్టం చేశారు టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి. 

Read more RELATED
Recommended to you

Latest news