బెంగళూరు రేవ్ పార్టీ కేసులో పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారు. ఈ పార్టీలో తెలుగు టీవీ, ఫిల్మ్ ఇండస్ట్రీకి చెందిన పలువురు నటులు పాల్గొన్నట్లు తెలిపారు. నటి హేమ సైతం రేవ్ పార్టీలో ఉన్నట్లు స్పష్టం చేశారు. తాను రేవ్ పార్టీలో లేనని చెప్పిన హేమపై సీర యాక్షన్ తీసుకునేందుకు సిద్దమవుతున్నారు.
తెలుగు యాంకర్ శ్యామల కూడా రేవ్ పార్టీలో ఉన్నట్టు ప్రచారం జరుగింది. దీంతో ఆమె స్పందించారు. కావాలనే తనపై అసత్య ప్రచారాలు చేస్తున్నారని మండిపడ్డారు. ఆ రేవ్ పార్టీకి తాను వెళ్లలేదన్నారు. ఆ పార్టీ ఎప్పుడు, ఎక్కడ జరిగిందో తనకు తెలియదన్నారు. తనపై అసత్య ప్రచారం జరుగుతోందని ఎమోషనల్ అయ్యారు. ‘ ఓ రాజకీయ పార్టీతో అనుసంధానం అయ్యానని తెలిసి.. కావాలనే తనపై దుష్ప్రచారం చేస్తున్నారు. ఆ పార్టీపై, నాపై బురద చల్లే ప్రయత్నం చేస్తున్నారు. అసత్య ప్రచారంపై న్యాయ పోరాటం చేస్తాం. ఇప్పటికే కేసులు నమోదు చేయించాం. ఎవరైనా సరే నిజాన్ని తెలుసుకోవాలి. అసత్య ప్రచారాలు చేయడం సరికాదు.” అని యాంకర్ శ్యామల ఆవేదన వ్యక్తం చేశారు.