టైమ్ పాస్ పాలిటిక్స్.. సీఎం రేవంత్ రెడ్డిపై డీకే అరుణ ఫైర్..!

-

ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీల అమలులో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం అయిందని, రేవంత్ రెడ్డిది మాటల గారడీ ప్రభుత్వమని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు అరుణ ధ్వజమెత్తారు. ఉద్యమకారులకు రూ.25 వేల పెన్షన్ ఇస్తామన్నారు. దీనిపై ఎక్కడైనా సమీక్ష జరిగిందా అని ప్రశ్నించారు. నిరుద్యోగుల భర్తీపై ఎక్కడైనా చర్చించారా అని నిలదీశారు. నల్గొండ జిల్లాలో బుధవారం వరంగల్, ఖమ్మం, నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రచారంలో భాగంగా నల్గొండ జిల్లాలో ఆమె ఇవాళ పర్యటించారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఇప్పటి వరకు తాము 30 వేల ఉద్యోగాలు ఇచ్చామని రేవంత్ రెడ్డి చెబుతున్నారు. కానీ ఆ ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారో ఎవరికీ తెలియదన్నారు. ఏ గ్రామానికి వెళ్లినా తమకు ఉద్యోగాలు రావడం లేదని చెబుతున్నారన్నారు. గాల్లో మాటలు చెప్పి కాగితాల మీద రాతలు చూపించి ప్రజలకు మోసం చేయడం తప్ప నిరుద్యోగులకు చేసిందేమి లేదన్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు అవుతున్నా నిరుద్యోగ భృతిపై ఏమైనా ఆలోచన చేశారా అన్నారు. ఇదిగో అదిగో ఉంటూ కాంగ్రెస్ ప్రభుత్వం టైమ్ పాస్ చేస్తోందని ధ్వజమెత్తారు. అవగాహన రాహిత్యం, అనుభవ లేమితనం కాంగ్రెస్ ప్రభుత్వంలో స్పష్టంగా కనిపిస్తోందని ఎద్దేవా చేశారు. ఖమ్మం, వరంగల్, నల్గొండ ఎమ్మెల్సీ ఉపు ఎన్నికలో ప్రజల కోసం పని చేసే నాయకుడిని ఎంచుకోవాల్నారు

Read more RELATED
Recommended to you

Latest news