పార్లమెంట్ ఎన్నికల వేళ తెలంగాణలో ప్రస్తుతం ఛాలెంజ్ పాలిటిక్స్ నడుస్తున్నాయి. ఆగస్టు 15 లోపు రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, ఆరు గ్యారెంటీలు, అమలు చేస్తే ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేస్తానని బీఆర్ఎస్ అగ్రనేత, మాజీ మంత్రి హరీశ్ రావు సవాల్ విసిరిన విషయం తెలిసిందే. సీఎం రేవంత్ రెడ్డి, హరీశ్ రావుల మధ్య సవాళ్లు.. ప్రతి సవాళ్లు జరుగుతుండగా.. రేసులోకి బీజేపీ ఎల్పీ నేత మహేశ్వర్ రెడ్డి ఎంట్రీ అయ్యారు. మహేశ్వర్ రెడ్డి సైతం సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసిరారు.
హైదరాబాద్ లోని బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. కేవలం రూ.2లక్షల రుణమాఫీ పై సీఎం రేవంత్ రెడ్డి సవాల్ విసురుతున్నారు. మరీ అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే అమలు చేస్తామని అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన ఆరు గ్యారెంటీల గురించి ఆయన ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలన్నింటిని తాను ఎమ్మెల్యే పదవీకి రాజీనామా చేసేందుకు కూడా సిద్ధమని సంచలన వ్యాఖ్యలు చేశారు మహేశ్వర్ రెడ్డి. సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్టు ఆగస్టు 15లోపు అన్ని హామీలు నెరవేరిస్తే.. తాను రాజకీయ సన్యాసం తీసుకుంటామని ఓపెన్ ఛాలెంజ్ చేశారు.