ఎమ్మెల్సీగా వాణీదేవి ప్రమాణ స్వీకారం

-

దివంగత మాజీ ప్రధాని పీవీ నర్సింహ రావు కూతురు సురభి వాణి దేవి…ఇవాళ ప్రమాణ స్వీకారం చేశారు. సురభి వాణీ దేవి పట్టభద్రుల ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేశారు. హైదరాబాద్ అసెంబ్లీ కౌన్సిల్ లో ప్రొటెం చైర్మన్ భూపాల్ రెడ్డి ఛాంబర్ లో ఎమ్మెల్సీ గా ప్రమాణ స్వీకారం చేశారు వాణీదేవి. వాణిదేవి గారి చేత ప్రొటెం ఛైర్మన్ భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించారు.

ఇక ఈ కార్యక్రమానికి తెలంగాణ రోడ్డు రవాణా శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి , మరియు రాజ్య సభ టీఆర్‌ఎస్‌ ఎంపీ కేకే హాజరయ్యారు. కాగా.. ఆమె గత మార్చి నెలలో హైదరాబాద్‌ – రంగారెడ్డి – మహబూబ్‌ నగర్‌ పట్టభ్రదుల నియోజక వర్గానికి జరిగిన ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ పార్టీ తరఫున పోటీ చేసి… ఘన విజయం సాధించారు. ఈ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థి బీజేపీ రామ్‌ చందర్‌ రావుపై సురభి వాణిదేవి విజయం సాధించారు.

Read more RELATED
Recommended to you

Latest news