ప్రపంచ దేశాలను కంటి మీద కునుకు లేకుండా చేస్తుంది కరోనా వైరస్. ఇలాంటి ప్రమాదకరమైన వైరస్ తో పోలీసులు మరియు డాక్టర్లు ప్రస్తుతం పోరాడుతున్నారు. కరోనా వైరస్ వ్యాధి గ్రస్తులకు చికిత్స అందిస్తూ వైద్యులు పోరాడుతుంటే మరోపక్క పోలీసులు ప్రజలను ఇంటి నుండి బయటకు రాకుండా కట్టడి చేయడానికి అనేక అవస్థలు పడుతున్నారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి, కుటుంబాలని వదిలి పోలీసులు పడుతున్న కష్టాన్ని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తించారు.ఈ సందర్భంగా పోలీసులకు అదిరిపోయే ఆఫర్ లు ప్రకటించారు. ఇప్పటికే వైద్య సిబ్బందికి, పారిశుద్ధ్య సిబ్బందికి గతంలో ప్రకటించినట్టుగానే పది శాతం బోనస్ ఇవ్వాలని క్యాబినెట్ సమావేశంలో తీర్మానించు కున్నట్లు కెసిఆర్ చెప్పుకొచ్చారు. ఇదే స్ఫూర్తిని కొనసాగించాలని అద్భుతంగా పని చేస్తున్నారని పోలీసులు ను పొగడ్తలతో ముంచెత్తారు. ఈ సందర్భంగా ‘‘ సీఎం ప్రోత్సాహకం కింద పోలీసులకు గ్రాస్ వేతనంలో 10 శాతం ఎక్కువగా ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించడం జరిగింది.
దీంతో ఈ ప్రకటనపై తెలంగాణ పోలీసులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. మా కష్టాన్ని మా ముఖ్యమంత్రి అర్ధం చేసుకున్నారు. అందుకే ఇలా మా కుటుంబాల్ని వదిలిపెట్టి ప్రజల కోసం పని చేస్తున్నామని పోలీసులు ఓపెన్ టాక్ లో కామెంట్ చేస్తున్నారు. ఈ విధమైన కష్టాన్ని గుర్తించిన కెసిఆర్ కి నిజంగా కృతజ్ఞతలు అంటూ ప్రజలు కూడా మాకు సహకరించాలని కోరుతున్నారు.