నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు: మేకతోటి సుచరిత.

-

నేను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయలేదు,ఎమోషన్ కు గురైన మాట వాస్తవమే, థాంక్స్ గివింగ్ లెటర్ను నా కుమార్తె తప్పుగా అర్థం చేసుకుందని వెల్లడించింది రాష్ట్ర హోంశాఖ మాజీ మంత్రి మేకతోటి సుచరిత.రాజీనామా చేసే సమస్యే లేదన్నారు సుచరిత.తాడేపల్లి లో సీఎం జగన్ తో గంటన్నరకు పైగా భేటీ అయిన సుచరిత ఈ వ్యాఖ్యలు చేశారు.ఏపీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ నేపథ్యంలో అలకబూనిన రాష్ట్ర హోంశాఖ మాజీ సుచరిత కాసేపటి క్రితం అలక వీడారు.తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయానికి వచ్చిన ఆమె సీఎం జగన్ తో గంటన్నరకు పైగా భేటీ అయ్యారు.ఆ తర్వాత ఆమె అక్కడే మీడియాతో మాట్లాడారు.తన అలక, ఎమ్మెల్యే పదవికి రాజీనామా పై జరిగిన ప్రచారం పై ఆమె స్పందించారు.

ఈ సందర్భంగా ఆమె పలు కీలక వ్యాఖ్యలు చేశారు.మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో పదవిని ఆశించిన నేపథ్యంలో పదవి దక్కకపోవడంతో చిన్నపాటి ఎమోషన్ కు గురైన మాట వాస్తవమేకానీ మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ సందర్భంగా థాంక్స్ గివింగ్ లెటర్ రాశానని, దానినే తన కుమార్తె తప్పుగా అర్థం చేసుకొని ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసినట్లు గా చెప్పిందని పేర్కొన్నారు.రాజీనామా అన్న ప్రశ్నే ఉత్పన్నం కాలేదని ఆమె చెప్పుకొచ్చారు.రాజకీయాల నుంచి తప్పుకోవాల్సి వస్తే వైసీపీ కార్యకర్త గానే కొనసాగుతానని మేకతోటి సుచరిత చెప్పుకొచ్చారు.జగన్ నిర్ణయానికి తాను కట్టుబడి ఉన్నానని కూడా సుచరిత చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news